/rtv/media/media_files/2024/11/22/oMZaKA6Bili0XFngG6KM.jpg)
ప్రముఖ బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అయితే.. నాటి జగన్ ప్రభుత్వ హయాంలో ఈ స్కామ్ జరిగిందన్న వార్తలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. జగన్ దోపిడి అమెరికాలో కూడా తెలిసిందంటూ కూటమి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల సైతం ఈ ముడుపుల వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేశారు. అసలు ఈ కుంభకోణం ఏ విధంగా వెలుగులోకి వచ్చిందో అనే విషయానికొస్తే.. 2021లో కేంద్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అనే కంపెనీని ఏర్పాటు చేసింది.
Also Read: 'మెకానిక్ రాకీ' రివ్యూ.. విశ్వక్ యాక్షన్, కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
బయ్యర్స్ వస్తేనే పెట్టుబడులు
అయితే ఆ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)కి 12 గిగా వాట్ల ఎనర్జీని సప్లై చేయడానికి అదానీ పవర్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఆ 12 గిగా వాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి బయ్యర్స్ (కొనుగోలు దారులు) ఎవరూ లేరు. దీంతో బయ్యర్స్ వస్తేనే పెట్టుబడులు వస్తాయి కాబట్టి బయ్యర్స్‌ని తీసుకురావడం కోసమే ఇప్పుడు అవినీతి జరిగినట్లు తెలిసింది.
పెద్ద ఎత్తున లంచం ఆరోపణలు
బయ్యర్స్ ను తీసుకురావడం కోసమే ఏపీ, ఒడిస్సా, ఛతీస్‌ఘడ్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లోని బయ్యర్స్‌ని కొనుగోలు చేయడం కోసం కొంత అవినీతి జరిగిందని.. వారికి పెద్ద ఎత్తున లంచం ఇచ్చారని ప్రస్తుతం అమెరికా కోర్టులో ఉన్న ప్రధాన ఆరోపణ.
Also Read: ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ భయం అవసరం లేదు!
12 గిగా వాట్ల పవర్‌ను సప్లై చేయడానికి అదానీ పవర్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. అయితే ఆ పవర్‌ను కొనడానికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. దీంతో పలు రాష్ట్రాల్లోన్ని అధికారులకు అదానీ లంచం ఇచ్చి ముందుకు తీసుకువచ్చినట్లు సమాచారం. అందులో 9వేల మెగా వాట్లను ఏపీ కొనడానికి ముందుకొచ్చింది.
దీనికోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 2021లో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న సౌర విద్యుత్ విక్రయ ఒప్పందాల్లో అప్పటి వైసీపీ హయాంలో అధికారులకు దాదాపు రూ.1750 కోట్లు లంచం అందిందని అమెరికా దర్యాప్తు సంస్థే నిర్ధారణకు వచ్చింది. ఇలా భారత్‌లో పలు రాష్ట్రాల్లోన్ని అధికారులకు మొత్తం రూ.2,029 కోట్ల లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ, అతని మేనళ్లుడు సాగర్ అదానీతో పాటు మరో 7గురిపై అమెరికాలో కేసులు నమోదు అయ్యాయి.
Also Read: జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు!
ఏపీ హాట్ టాపిక్
అయితే ఇప్పుడీ వ్యవహారం ఏపీ హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాలో అదానీపై మోపిన చార్జిషీట్‌లో జగన్ ప్రస్తావన లేవనెత్తడంతో ఏపీలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దాదాపు 12,13 పేజీలలో జగన్ - అదానీ బంధంపై పేర్కొన్నట్లు తెలిసింది. 51 నుంచి 54 పాయింట్స్‌లో అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు పేర్కొన్నట్లు సమాచారం. గతంలో వైసీపీ హయాంలో అదానీతో ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటి అయ్యారు. సెకితో విద్యుత్ ఒప్పందం కుదరడానికి ముందు గౌతమ్ అదానీ మూడుసార్లు అప్పటి సీఎం జగన్‌ను కలిశారు.
Also Read: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. !
దీంతో ఈ రూ.1750 కోట్ల లంచాన్ని అప్పటి అధికార ప్రభుత్వంలోని వైసీపీ పెద్దలు అందుకున్నారని ప్రధానంగా వినిపిస్తుంది. 2019-24 మధ్య ఏపీలో పలువురు అధికారులకు.. అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో వైఎస్ జగన్‌తో అదానీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సమయంలోనే రూ.2.49కి యూనిట్ చొప్పున 2.4 గిగావాట్ల కొనుగోలుకు చేసి.. 25 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఛార్జిషీట్ మా దగ్గర కూడా ఉంది: చంద్రబాబు
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ, బ్రాండ్‌ను దెబ్బతీసేలా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు శాసనసభ సమావేశాల్లో మాట్లాడిన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోందని.. మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తాం అని పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్ తమ దగ్గర కూడా ఉందని.. దీనిపై విచారణ చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు
రూ.60 వేల కోట్లు దోచుకొని జగన్ ఈడీ కేసుల్లో ఉన్నారన్నారని.. 12 ఏళ్లుగా కేసును నడుపుకొంటూ వెళ్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. వాటిని ఎలా పొడిగించాలో తెలిసిన వ్యక్తి జగన్ అని.. అలాంటి వ్యక్తికి రూ.1,750 కోట్లు లంచం తీసుకోవడం ఓ లెక్కా అని పేర్కొన్నారు.
AP News: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ అండగా ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు!
అమరావతి రాజధానికి మోదీ సర్కార్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. ఏపీకి కేంద్ర సహాయంపై ఓ వీడియో రిలీజ్ చేశారు.
Purandeshwari
AP News: అమరావతి రాజధానికి మోడీ సర్కార్ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు కేంద్రం అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు కేంద్రం మంజూరు చేసినట్లు వెల్లడించా. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో డబుల్ ఇంజన్ సర్కార్ కు ప్రజలు పట్టం కట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. అమరావతి నిర్మాణానికి, అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ చెప్పినట్లు గుర్తు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం..
వరల్డ్ బ్యాంకు ద్వారా 15వేల కోట్లు, హడ్కో కింద 11వేల కోట్లు ఏపీకి అందించడానికి నిర్ణయం చేశారు. హడ్కో కింద 11వేల కోట్ల రూపాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో నేడు ఒప్పందం చేసుకున్నారు. 15వేల కోట్లు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు కలిపి 13వేల 600కోట్లు ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1400కోట్లు అందిస్తుంది. ఈ 15వేల కోట్లు మొబలైజేషన్ లో 25శాతం గ్రాంట్ కింద ఇస్తామని కేంద్రం చెప్పిన విధంగా ఇటీవల 4వేల 285 కోట్లు కేంద్రం అందించింది. కేంద్రం నుంచి వచ్చే సహకారాన్ని అందిపుచ్చుకుంటూ అమరావతిని అద్భుతంగా అభివృద్ది చేయాలని కోరుతున్నాను అని పురంధేశ్వరి వివరించారు.
Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
bjp-purandeswari | amaravathi | telugu-news | today telugu news
వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
Life Style: 20-20-20 ఫార్ములా ఎప్పుడైనా ట్రై చేశారా? స్క్రీన్స్ ముందు ఉండేవారికి ఇది చాలా ముఖ్యం
Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య
రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
Iphone 15 Price Drop: ఐఫోన్ 15పై బిగ్గెస్ట్ డిస్కౌంట్ భయ్యా.. వదిలారో మళ్లీ మళ్లీ రాదు!