/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/birdflu-jpg.webp)
ఏపీలో బర్డ్ ఫ్లూ (Bird Flu) వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ సోకి చాలా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా (Eluru District) లోని ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తి కి బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. కోళ్లఫారం సమీపంలో ఉంటున్న సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించగా.. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపంచారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వార్తతో వెంటనే జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలకు ఆందోళన అవసరం లేదన్నారు జిల్లా వైద్యశాఖధికారిణి డాక్టర్ మాలిని.
Also Read : వల్లభనేని వంశీకి ఊహించని షాకిచ్చిన పోలీసులు... 7 సెక్షన్ల కింద కేసులు
Also Read : ఇక మీదట అమెజాన్లో కూడా పది నిమిషాల్లో డెలివరీ..
పడిపోయిన చికెన్ ధరలు
ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ప్లూ వైరస్ గట్టిగానే ఉంది. తూర్పు గోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో కలకలం చెలరేగింది. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షల కోళ్లు మృతి చెందినట్లు అంచనా. బర్డ్ ఫ్లూ భయం, అధికారుల హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో చికెన్ రేటు దారుణంగా పడిపోయింది. కోళ్లకు వైరస్ సోకుతుందనే అనే ప్రచారం బాగా జరగడంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. అంతకుముందు కళకళలాడిన చికెన్ సెంటర్లు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతున్నాయి. ఆదివారం కేజీ రూ.200-220 ఉన్న ధర ఇప్పుడు రూ.150-170 పలుకుతోంది. రేటు తగ్గిన సరే జనాలు మాత్రం చికెన్ కొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
Also Read : బెస్ట్ సీఎంగా యోగి.. చంద్రబాబుకు నాలుగో స్థానం.. రేవంత్ ర్యాంకు ఎంత?