/rtv/media/media_files/2026/02/27/ayesha-meera-2026-02-27-12-01-09.jpg)
Ayesha Meera
అయేషా మీరా కేసు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో అడుగడుగున అనుమానాలు తలెత్తుతున్నాయి. హాస్టల్‌లో ఆమె తోటి విద్యార్థినులను పోలీసులు ఇప్పటికీ విచారించలేదు. ఆ రోజు అయేషా రూమ్ తలుపులు ఎవరు తెరిచారు ?, హంతకుడికి హాస్టల్‌లో ఎవరు సహకరించారనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే ఈ కేసులో అయేషా శరీర అవశేషాల ఖనన ఏర్పాట్లకు సంబంధించి CBI అధికారులు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాటు చేయాలని తెనాలీ తహశీల్దార్‌కు లేఖ రాశారు. ఈ చర్యలు సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాల మేరకు చేపట్టనట్లు తెలుస్తోంది. శుక్రవారం ఆమె అవశేషాలను ఖననం చేయనున్నారు.
రీ పోస్టుమార్టం తర్వాత సీబీఐ స్వాధీనం చేసుకున్న అవశేషాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు బాధితురాలి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు వారు అవశేషాలను ఖననం చేయనున్నారు. ముస్లిం మతపెద్దలతో చర్చలు జరిపి తెనాలిలో ఖబర్‌స్తాన్‌లో అంత్యక్రియలు జరపాలని ఆమె తల్లిదండ్రులు కోర్టుకు తెలియజేశారు. కోర్టు పర్మిషన్ మేరకు అవశేషాలను అంబులెన్స్ ద్వారా తెనాలి సమాధి వద్దకు తీసుకెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also read: DMK పార్టీలో చేరిన పన్నీర్ సెల్వం..
ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సీబీఐ అధికారులు సూచనలు చేశారు. ప్రజల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని తెలిపింది. మరోవైపు 'చలో తెనాలి' పేరుతో విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరేందుకు రెడీ అవుతున్నారు. 19 ఏళ్ల పాటు ఈ కేసులో న్యాయపోరాటం చేసిన ఆయేషా మీరా తల్లిదండ్రులకు సపోర్ట్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
అసలేంటి ఈ కేసు
విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలో శ్రీ దుర్గా లేడిస్ హాస్టల్‌లో అయేషా మీరా ఉండేది. నిమ్రా కాలేజీలో ఆమె ఫార్మసీ కోర్సు ఫస్ట్ ఇయర్ చదవుతోంది. 20-07, డిసెంబర్ 27న రాత్రి 17 ఏళ్ల అయేషా తన హాస్టల్ గదిలోని బాత్రూమ్‌లో రక్తపు మడుగులో శవమై కనిపించింది. దుండగులు ఆమెపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశారు. హంతకుడు అక్కడ ఒక లేఖను వదిలేసి వెళ్లాడు, అందులో "నా ప్రేమను నిరాకరించినందుకే ఈ పని చేశాను" అని రాసి ఉంది. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది.
ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2008లో సత్యం బాబు అనే దళితుడిని నిందితుడిగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2010లో విజయవాడ మహిళా కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సత్యం బాబుకు నరాల వ్యాధి ఉందని.. అతను సరిగ్గా నడవలేడని, ఎత్తైన గోడలు దూకి హత్య చేయడం అసాధ్యమని మానవ హక్కుల సంఘాలు వాదించాయి. చివరికి 8 ఏళ్ల తర్వాత 2017లో ఏపీ హైకోర్టు సత్యం బాబును నిర్దోషిగా పేర్కొంటూ అతడిని విడుదల చేయాలని ఆదేశించింది.
Also Read: మెట్రోలో కరెంట్ పోతే టెన్షన్ వద్దు.. గ్రిడ్ ఫెయిల్ అయినా రైలు ఆగదు!
అయేషా తల్లిదండ్రులు మొదటి నుంచే అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత మనుమడు, అతడి స్నేహితులపై ఆరోపణలు చేస్తున్నారు. అసలైన హంతకులను కాపాడేందుకు సాక్ష్యాలు తారుమారు చేశారంటూ న్యాయపోరాటం చేశారు. చివరికి 2019లో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును స్వీకరించింది. ఈ కేసు విచారణలో భాగంగా 2019 డిసెంబర్ అయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం చేశారు. మొత్తంగా 19 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత, విజయవాడలోని సీబీఐ కోర్టు ఈ కేసును క్లోజ్ చేస్తూ ఫిబ్రవరి 20, 2026న తీర్పునిచ్చింది. సీబీఐ సమర్పించిన ఫైనల్ రిపోర్టు ప్రకారం సరైన సాక్ష్యాలు లేకపోవడంతో హంతకులను గుర్తించలేకపోయామని, అందుకే విచారణను ముగిస్తున్నామని కోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు ఆమె అవశేషాలను శుక్రవారం సీబీఐ అధికారులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
Follow Us