APSRTC: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవానికి ప్రపంచనలుమూల నుంచి కోట్లాది భక్తులు త్రివేణి సంగమం వద్దకు చేరుకుంటున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ఈ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. 45 రోజుల పాటు ఈ మహా ఉత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ కుంభమేళకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
స్పెషల్ బస్..
మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రాజమండ్రి, కొవ్వూరు నుంచి స్పెషల్ బస్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రయాణీకులకు అతితక్కువ ధరకే సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక బస్ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఏపీ ఆర్టీసీ తెలిపింది. ఈ ఉత్తమమైన సర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ కోరింది.
ప్యాకేజ్ డీటెయిల్స్..
ఈ స్పెషల్ బస్ సర్వీస్ ను 7 రోజుల ప్యాకేజ్ తో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని టికెట్ ధర(రానూ, పోనూ కలిపి) ఒక్కరికి రూ. 10000గా ఆర్టీసీ నిర్ణయించింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 2 గంటలకు కొవ్వొరు బస్ కాంప్లెక్స్ నుంచి బస్సు బయలుదేరుతుంది. ఏడు రోజులు పాటు కొనసాగే ఈ యాత్రలో.. ప్రయాగ రాజ్, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు బస ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు. తాగేందుకు నీళ్లు కూడా ఇస్తారు. ఏడు రోజుల యాత్రలో భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగరాజ్-మహా కుంభమేళా వారణాసి, గయ, బుద్ధగయ, అరసవిల్లి, శ్రీకూర్మం పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుంది. వీటితో పాటు త్రివేణి సంఘమ స్నానం, విశ్వనాధ దర్శ, గయ పిండ ప్రదానం వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి.
ఏపీఎస్ఆర్టీసీ కుంభమేళకు వెళ్లే ప్రయాణికులను గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 10, 000 ప్యాకేజ్ తో మహా కుంభమేళాకి స్పెషల్ బస్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ బస్సు ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి కొవ్వొరు బస్ స్టాప్ నుంచి బయదేరుతుంది.#APSRTC #kumbhmela2025prayagraj… pic.twitter.com/swo2rTV390
— RTV (@RTVnewsnetwork) January 22, 2025
టికెట్ కొనడం ఎలా..
ఈ స్పెషల్ ప్యాకేజ్ కోసం టికెట్ కొనాలనుకునేవారు కొవ్వొరు బస్సు డిపోను సంప్రదించాలి. అక్కడే మీ టికెట్లు బుక్ చేయబడతాయి. ప్రయాణానికి ముందు మొబైల్ యాప్ ద్వారా యాత్రికులు బస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన అదనపు సమచారం కోసం 7382907952 (సూర్య చంద్రరావు), 8121582849 (రామకృష్ణ) సంప్రదించవచ్చు.
Also Read: Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు