Ap: ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారగా.. ప్రస్తుతం ఆ వాయుగుండం బలహీనపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

New Update
rains

AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా బలహీనపడింది.ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదిలి డిసెంబర్ 24 నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతం చేరుకునే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Also Read: CPI: ప్రభుత్వమే సిగ్గులేకుండా 'పుష్ప'ను ప్రోత్సహించింది.. నారాయణ!

ఈ వాయుగుండం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రైతులు, ప్రజలు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది రేవంత్ అనుచరులేనా? ప్రూఫ్స్ తో సహా..!

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో సోమవారం విశాఖపట్నం,  కృష్ణా, గుంటూరు,అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా,  బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 

Also Read: Fire Accident: కాచిగూడ-చెన్నై ఎగ్మోర్‌ రైలులో మంటలు

అలాగే డిసెంబర్ 24వ తేదీ అంటే మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. . పంట పొలాల్లో నీరు నిలువ ఉండకుండా బయటకు వెళ్లేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Also Read: ఎన్డీయేలో చేరనున్న నేషనల్ కాన్ఫరెన్స్ !.. క్లారిటీ ఇచ్చిన పార్టీ

మరోవైపు వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో పంటపొలాల్లోని రైతులు, గొర్రెలు, పశువుల కాపర్లు చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించింది. అలాగే వాగులు, వంకల సమీపానికి వెళ్లవద్దని జాగ్రత్తలు చెప్పింది. 

కల్వర్టులు, పాత నిర్మాణాల వద్దకు వెళ్లరాదని సూచించింది. మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉంటే మంచిదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ముందు జాగ్రత్తలు చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు