Sharmila: చంద్రబాబు 100 రోజుల పాలనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు 100 రోజుల పాలన వైఎస్‌ఆర్‌ విగ్రహాలు కూల్చడం, పేర్లను తొలగించేందుకే సరిపోయినట్లుగా ఉందని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్‌లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Sharmila

చంద్రబాబు 100 రోజుల పాలన శిశుపాలుడు 100 తప్పులులాగా ఉందని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఎక్స్‌ వేదికగా విమర్శలు చేశారు. వైఎస్‌ఆర్‌ విగ్రహాలు కూల్చడం, పేర్లను తొలగించేందుకే 100 రోజులు సరిపోయినట్లుగా ఉందని సెటైర్లు వేశారు. చంద్రబాబు 100 రోజుల పాలనకు సున్నా మార్కులు వేస్తున్నామని అన్నారు. సూపర్ సిక్స్‌లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. " అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20 వేలు అన్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. కనీసం 7 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులకు 20 లక్షల ఉపాధి అవకాశాలు.. లేకుంటే రూ.3వేల నిరుద్యోగ భృతి అన్నారు. అటు ఉపాధి లేదు.. ఇటు భృతి లేదు. 2014లోనూ ఇలాగే రూ.2వేలు భృతి అని మోసం చేశారు. ఇప్పుడు కూడా ఇస్తారో లేదో నమ్మకం లేదు.

Also Read: కెనెరా బ్యాంకులో 3000 ఉద్యోగాలు.. రేపటినుంచే అప్లికేషన్స్!

 తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15వేలు అన్నారు. దీనిపైనా స్పందన లేదు. మహిళలకు నెలకు రూ.1500, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు హామీలు అమలు కాలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంగతే లేదు. ఈ పథకం తొందరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పథకాల అమలుపై ప్రశ్నిస్తుంటే.. రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటున్నారు. మరి అప్పుల్లో ఉన్న సంగతి ఎన్నికల ముందు తెలుసు కదా.. మరి అలాంటప్పుడు ఎందుకు అలవికానీ హామీలు ఇచ్చారు. 100రోజుల పాలనపై 100 విజయాలు అంటూ కరపత్రం రిలీజ్ చేశారు.

ఈ కరపత్రం చూస్తుంటే నవ్వాలో,ఏడవాలో తెలియని పరిస్థితి. వరద సహాయం కింద ఇచ్చిన 25కేజిల బియ్యం, బుడమేరు గండ్లు పూడ్చడం, అమరావతికి రూ.15వేల కోట్ల గ్యారెంటీ,  ప్రజాదర్భార్‌లో అర్జీలు స్వీకరించడం, సౌదీ అరేబియాలో ఒక తెలుగు కుటుంబాన్ని స్వస్థలానికి రప్పించడం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో కేంద్ర మంత్రి పర్యటించడం, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చడం కూడా 100 రోజుల విజయమట. బాధ్యతలను విజయాలుగా చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారే తప్ప.. ఈ 100 రోజుల పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమిలేదని'' వైఎస్‌ షర్మిలా అన్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment