విజయవాడలో యువతి డిజిటల్ అరెస్ట్.. రూ.1.25 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు

సైబర్‌ నేరగాళ్లు డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో విజయవాడకు చెందిన ఓ యువతి వద్ద నుంచి రూ. 1.25 కోట్లు కాజేశారు. నకిలీ ఫోన్లకు మోసపోవద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ అమాయకులు మోసపోతూనే ఉన్నారు.

New Update
cyber scam,

AndhraPradesh:  డిజిటల్ అరెస్ట్‌ అంటూ వచ్చే ఫోన్లను నమ్మవద్దని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా అమాయకులు మోసపోతూనే ఉన్నారు. నకిలీ పోలీసుల మాటలకు బెంబేలెత్తిపోయి డబ్బులు కట్టేస్తున్నారు. కొద్ది నెలలుగా నగర వాసులను సైబర్‌ నేరగాళ్లు డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో భయపెట్టేస్తూ రూ. లక్షల నుంచి కోట్లు కొల్లగోడుతున్నారు.

Also Read:  ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!

తాజాగా విజయవాడ గాయత్రినగర్‌కు చెందిన ఓ యువతి (25) ఇలాగే మోసపోయి సైబర్‌ నేరగాళ్లకు రూ. 1.25 కోట్లు చెల్లించారు. తరువాత మోసపోయినట్లు గుర్తించి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

గాయత్రి నగర్‌ కు చెందిన యువతి హైదరాబాద్‌ లోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుంటారు. ఆమె తల్లిదండ్రులను చూసేందుకు విజయవాడకు వచ్చారు. ఉదయం 10.30 గంటల సమయంలో గుర్తు తెలియన వ్యక్తి ఫోన్‌ చేసి ముంబై పోలీసులమంటూ పరిచయం చేసుకున్నాడు.

Also Read: ఎస్సీ వర్గీకరణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 60 రోజుల్లో నివేదిక!

మీకు వచ్చిన కొరియర్‌ లో మాదక ద్రవ్యాలున్నాయని మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తున్నామంటూ భయపెట్టాడు. అరెస్ట్‌ కాకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని చెప్పడంతో యువతి కంగారు పడింది. 

దీంతో ఆ యువతి రూ. 1.25 కోట్లు ఆగంతకుడు చెప్పిన ఖాతాలకు పంపించారు. తరువాత ఆమె మోసపోయినట్లు గుర్తించారు. శుక్రవారం రాత్రి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితరాలు చెప్పిన వివరాల ప్రకారం నగదు బదిలీ అయిన బ్యాంకు ఖాతాల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. సైబర్‌ క్రైం సీఐ గుణరాం కేసు నమోదు చేశారు.

Also Read: Moisturizer: శీతాకాలంలో ఎలాంటి మాయిశ్చరైజర్‌ ఉపయోగించాలి?

ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా

బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రికి ఓ దుండగులు టోకరా వేశారు. రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీకి ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత హోదాలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.25 లక్షలు టోకరా వేశారు. దీంతో జగదీశ్ సింగ్ బరేలీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ యూపీలోని బరేలీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వేరు ఫ్రెండ్ ద్వారా జగదీష్‌కి దివాకర్ గార్డ్, ఆచార్య జయప్రకాశ్ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. రాజకీయ నేతలతో అతనికి దగ్గర సంబంధాలు ఉన్నాయని జగదీష్‌ పటానీను నమ్మించారు.

ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సమయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లేదా ఉన్నత హోదా ఇస్తామని నమ్మించారు. వారు చెప్పిన మాటలు నమ్మిన జగదీష్ డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఉన్నత హోదా ఉద్యోగ కోసం రూ.25 లక్షలు జగదీష్ నుంచి దుండగులు తీసుకున్నారు. ఈ డబ్బును వేర్వేరు అకౌంట్లలోకి బదిలీ చేశారు. అయితే మూడు నెలలు అవుతున్నా ఎలాంటి హోదా కల్పించలేదు. 

అడిగితే డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. కానీ ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వలేదు సహా.. బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. దీంతో మోసపోయానని గుర్తించి అతను పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ దుండగులు పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: Sabarimala: అయ్యప్ప దర్శనాలకు పోటెత్తిన భక్తులు..తొలిరోజే ఎంతమందంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment