TDP MLA Adimulam Issue: ఏపీ సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీల బాగోతం మరోసారి చర్చనీయాంశమైంది. 50 మంది మహిళా నేతలు, ఉద్యోగులతోపాటు కాలేజీ అమ్మాయిలను లైంగికంగా వేధించినట్లు సత్యవేడు ప్రజానీకం పేరుతో సీఎం చంద్రబాబుకు(CM Chandrababu) లేఖ రాయడం కలకలం రేపుతోంది. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?
వయసుతో సంబంధం లేకుండా..
ఈ మేరకు గతంలోనూ ఓ మహిళలో అడ్డంగా బుక్ అయిన ఎమ్మెల్యే ఆదిమూలంపై మరోసారి రాసలీల ఆరోపణలు రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దాదాపు 50 మంది మహిళలను ఎమ్మెల్యేల ఆదిమూలం వేధింపులకు గురిచేశారంటూ సత్యవేడు ప్రజానీకం పేరుతో సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. బాధితుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఊరి పేర్లతో సహా సీఎంకు ఫిర్యాదు చేశారు. వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్నాడని, ఇందులో టీడీపీ మహిళా నేతలు, ఉద్యోగులు, కాలేజీ అమ్మాయిలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. సిఎం చంద్రబాబు చేతికి ఆదిమూలం చిట్టా చేరడంతో ఎలాంటి చర్యలు చేపడుతారోననే ఉత్కంఠ మొదలైంది.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal: ఎన్నికల కమిషనర్‌కు బీజేపీ ఆఫర్.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఇక గతంలోనూ ఆదిమూలం చేసిన గలీజ్ పనులపై ఒక మహిళా మీడియా ముందుకొచ్చింది. ఏకంగా ఆమెతో లాడ్జ్ లో నగ్నంగా శృంగారంలో పాల్గొన్న వీడియోను విడుదల చేసింది. ఈ అంశం టీడీపీలో తీవ్ర చర్చకు దారితీయగా తన తప్పేమీ లేదని, రాజకీయ కక్షతోనే ఇదంతా చేశారని ఆదిమూలం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ కేసు కోర్టు వరకు వెళ్లగా సదరు మహిళా కాంప్రమైజ్ కావడంతో ఆదిమూలంకు ఊరట లభించింది. ఇదిలా ఉంటే ఆదిమూలం నియోజకవర్గంలో అనేక అక్రమ దందాలు, వసూళ్లకు పాల్పడుతునే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Kurnool: కర్నూల్‌లో కలకలం.. యువకుడు దారుణ హత్య