BIG BREAKING: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయం 10.34 నిమిషాలకు శబ్దాలతో భూమి స్వల్పంగా షేక్ అయ్యింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలతో ఉరుకులు పరుగులు తీశారు. ఇటీవలే ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం, తాళ్లూరు మండలం, పోలవరం, శంకరాపురం, తూర్పుకంభంపాడు, వేంపాడు, మారెళ్ల, పసుపుగల్లు, ముండ్లమూరు, శంకరాపురం సహా మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. Also Read: Hansika: హన్సిక అందాలు అదుర్స్.. డిజైనర్ లెహంగా, భారీ నెట్ సెట్ తో స్టన్నింగ్ ఫోజులు! గత మూడు రోజుల్లోనే.. కాగా, గత మూడు వ్యవధిలోనే ఇన్ని సార్లు భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు పట్టించుకోరా అని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో దర్శి నియోజకవర్గం మంత్రులు గొట్టిపాటి రవి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. డిజాస్టర్ శాఖా ఆధ్వర్యంలో లోతైన విచారణ అవసరమని.. జరుగుతున్న సంఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. BIG BREAKING: ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలుఏపీ ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. దర్శి నియోజకవర్గంలో ఉదయం 10.34 నిమిషాలకు శబ్దాలతో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలోకి పరుగులు తీశారు.#earthquake #AndhraPradesh #RTV pic.twitter.com/ki0JjX0Avf — RTV (@RTVnewsnetwork) December 23, 2024 Also Read: CV Anand Apology: అల్లు అర్జున్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సారీ చెప్పిన హైదరాబాద్ సీపీ!