Ap Liquor: ఓరి మీ దుంపలు తెగ..అన్ని కోట్లు ఎలా తాగేశార్రా బాబు!

సంక్రాంతి మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది.పండుగ రోజుల్లోనే ఏకంగా రూ.400 కోట్ల విలువైన మద్యం తాగేసినట్లు అధికారులు అంటున్నారు. ఇక చివరి రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం.

New Update
liquor

Sankranti: సంక్రాంతి పండగకు ఏపీలో మందుబాబులు తగ్గేదే లే అన్నట్లుగా తెగ తాగేశారు. పండగ జరిగిన మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. భోగి పండగ రోజు రూ.100 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. ఇక సంక్రాంతి, కనుమ రోజుల్లో అయితే రోజుకు రూ. 150 కోట్ల చొప్పున మద్యం అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇది సాధారణం కంటే రూ.160 కోట్లు అధికం అని సమాచారం.

Also Read: Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

సాధారణంగా ఏపీలో నిత్యం రూ.80 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతాయి. కానీ పండగ మూడు రోజుల్లో అదనంగా రూ.160 కోట్ల మద్యం అమ్ముడైనట్లు సమాచారం. భోగి రోజున మద్యం లైసెన్స్‌దారులు రూ.210 కోట్ల మద్యం కొనుగోలు చేయగా.. గురువారం రూ. 220 కోట్ల మద్యాన్ని తీసుకుని వచ్చినట్లు తెలుస్తుంది.

Also Read: Breaking: చిత్తూరులో ఘోర ప్రమాదం..నలుగురు మృతి!

7 లక్షల కేసుల మద్యం.. 2.30 లక్షల కేసుల బీర్లు..

అయితే సంక్రాంతి పండగ కోసం తెచ్చుకున్న సరుకు దాదాపుగా ఖాళీ అయిపోవడంతో.. గురువారం  లిక్కర్ షాప్ ఓనర్లు మళ్లీ భారీగా మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చూస్తే 7 లక్షల కేసుల మద్యం.. 2.30 లక్షల కేసుల బీర్లు అమ్ముడు అయ్యాయి. ఇక ఈ 6 రోజుల్లో మద్యం అమ్మకాలు సగటు కంటే లక్ష కేసుల మద్యం, దాదాపు 30 వేల కేసుల బీర్లు అధికం అని తెలుస్తుంది. 

అయితే గతంలో ఎప్పుడూ సంక్రాంతి పండగకు ఈ స్థాయి అమ్మకాలు నమోదు కాలేదని ఏపీ ఎక్సైజ్‌ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడం.. మద్యం ధరలు తగ్గించడం, నాణ్యమైన మద్యం సరఫరా వంటి కారణాలు ఏపీలో సంక్రాంతి పండగకు మద్యం అమ్మకాల్లో పెరుగుదలను నమోదు చేశాయనే వాదనలు వినపడుతున్నాయి. ఇక ఈసారి కోడి పందేల బరులు కూడా భారీగా పెరగడం మద్యం అమ్మకాలను మరో స్థాయికి వెళ్లినట్లు తెలుస్తుంది.

ఇతర రాష్ట్రాల నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ రాకుండా ఎక్సైజ్‌ శాఖ పటిష్ట చర్యలు తీసుకోవడంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. 

Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈనెల 20 నుంచి..!

Also Read: Telangana: తెలంగాణలో మందుబాబులకు షాక్...ధరల పెంపు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు