/rtv/media/media_files/2025/03/01/nYFAZYJhHBuYy9okdPfx.jpg)
Ap Intermediate Exams Begin Today
ఏపీలో నేటి నుంచి (మార్చి 1) ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఉదయం 8.30 గం.ల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
ఇవాళ మొదటిరోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి పరీక్ష జరగనుంది. వారు సెకండ్ లాంగ్వేజ్‌పై పరీక్ష రాయనున్నారు. ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు.. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఒక రోజు తప్పించి మరో రోజు జరగనున్నాయి. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
10.58 లక్షల మంది విద్యార్థులు
ఎక్కడా విద్యార్థులకు ఆటంకం కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు కూడా పెట్టారు. వాటిని ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారుల ఆఫీసులకు అటాచ్ చేశారు. మరోవైపు ఈ పరీక్షలను దాదాపు 10.58 లక్షల మంది విద్యార్థులు రాయనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి
ఇక అధికారులు కొన్ని వస్తువులను అనుమతి చేయబోమని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కేవలం చీఫ్ సూపరింటెండెంట్‌కు మాత్రం ఒక కీప్యాడ్ ఫోన్‌ను ఇంటర్‌బోర్డు ఏర్పాటు చేసింది.
అది కూడా కేవలం అధికారిక సమాచారం కోసం మాత్రమే అని తెలిపింది. ఇక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. లోపలికి పంపేంచేది లేదని అధికారులు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. . .