/rtv/media/media_files/2025/03/05/4jFvcDXH9pkL0LubaEL6.jpg)
Y. S. Vivekananda Reddy
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసుపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్ వేసింది. పులివెందుల కోర్టుకు ఇచ్చిన రిపోర్డును జత చేసి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఈ అఫిడవిట్‌లో సంచలన విషయాలు వెల్లడించింది. వివేకా హత్య కేసును ఎంపీ అవినాష్ తప్పుదోవ పట్టించారు. సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించాలని చూశారు. అవినాష్ మార్గనిర్దేశంతోనే సీబీఐ అధికారి రాంసింగ్, వైఎస్ సునీత, నర్రెడ్డిలపై కేసు నమోదు చేశారు. వివేకా హత్య కేసును తారుమారు చేసే కుట్ర చేశారంటూ అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
Also Read : త్వరలో తీహార్ జైలు తరలింపు.. ఎక్కడికంటే ?
Also Read : ఇవేం కోరికలు.. కత్రినా ప్రెగ్నెన్సీ పై నెటిజన్ల పోస్టులు!
Supreme Court ys Vivekananda Reddy Case
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆయన పీఏ కృష్ణారెడ్డి పులివెందుల వైఎస్సార్సీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి 2023లో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు వేశారు. విచారించిన న్యాయస్థానం ముగ్గురిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించగా, వివిధ సెక్షన్ల కింద 2023 డిసెంబర్ 15న కేసులు నమోదు చేశారు. వివేకా కేసు దర్యాప్తులో భాగంగా 2023 సెప్టెంబరులో విచారణకు పిలిచిన సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను తీవ్రంగా కొట్టాడని అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాలనే విధంగా హింసించారని కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. సునీత దంపతులు కూడా సీబీఐ ఎస్పీ రాంసింగ్ చెప్పినట్లు సాక్ష్యం చెప్పాలని లేదంటే ఇబ్బందులు తప్పవని బెదిరించినట్లు పేర్కొన్నారు.
Also read : రాజేంద్రప్రసాద్ తాగొచ్చాడా.. వైరల్ గా మారిన సంచలన వీడియో!
Also Read : ఫేస్ మసాజ్ చేయించుకోవడం వల్ల ప్రయోజనాలేంటి?
ys-viveka-murder | ys-viveka-murder-case | mp-avinash-reddy | andhra-pradesh-news | latest-news-in-telugu | today-news-in-telugu