Pawan Kalyan: ఏపీలో ఆ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన డిప్యూటీ సీఎం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీఊరట కల్పించింది.పెండింగ్ జీతాలు చెల్లింపులతో పాటుగా ఉద్యోగ భద్రతను కూడా కల్పించనున్నారు.

New Update
Pawan Kalyan: గ్రామపంచాయతీ నిధులపై శ్వేతపత్రం: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌  పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఓ గుడ్‌ న్యూస్‌  చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పెండింగ్ ఉన్న జీతాలను చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ సూచనలతో.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ కృష్ణతేజను ఆదేశించడంతో ఉద్యోగులకు పెండింగ్‌ జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పీఆర్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు ఈఎన్‌సీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కూడా కల్పించనున్నారు.

Also Read:  తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు!

ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఇన్స్యూరెన్స్‌  సౌకర్యాలను తిరిగి ప్రారంభించనుననారు. మరోవైపు తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్న వారందరినీ అధికారులు గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోకి తెచ్చారు . అంతేకాదు సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ సర్వీస్‌ సంస్థ పరిధిలో ఉద్యోగులకు కూడా హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయనున్నారు. 

Also Read:  హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలు.. అతిక్రమిస్తే చర్యలు తప్పవు

ఇక నుంచి ప్రతి నెలా జీతం..

వీరిని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా తీసుకుని.. ఇక నుంచి ప్రతి నెలా జీతం ఇచ్చేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఈ మేరకు బకాయిల కోసం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఇప్పటికే రూ.24 కోట్లు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.

Also Read: తెలంగాణలో 10 మంది ఎస్పీలు డిస్మిస్‌...!

కాంట్రాక్టు విధానంలో ఈఎన్‌సీ ఆధ్వర్యంలో టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, అటెండర్లు, స్వీపర్లు కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 670 మంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ పనులు విస్తృతంగా చేపడుతుండటంతో.. గతంలో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం వారిని కాంట్రాక్టు విధానంలో నియమించిన సంగతి తెలిసిందే.

Also Read:  డ్రగ్స్‌పై రాజీ ధోరణి ఎందుకు..?

వీరిని గ్రామాల్లో మెటీరియల్‌ నిధులతో చేపట్టే సిమెంట్‌రోడ్లను పర్యవేక్షించేందుకు నియమించారు. గతంలో రాష్ట్రంలో ప్రతి ఏటా 10 వేల కిలోమీటర్ల మేరకు సిమెంటు రోడ్లు వేస్తుండటంతో ఇంజనీర్లకు పనుల ఒత్తిడి పెరిగింది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ మండలస్థాయిలోను, ఈఎన్‌సీ కార్యాలయంలోనూ సుమారు 56 మంది సిబ్బందిని నియమించారు.

వీరికి జీతాల కోసం 3 శాతం నిర్వహణ వ్యయం ఈఎన్‌సీ కార్యాలయానికి అందజేసేవారు. గత ప్రభుత్వంలో వీరికి వేతనాలు అందలేదు.. ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడంతో కొంతకాలం జీతాలు అందించారు. కానీ ఆ తర్వాత జీతాలు నిలిపివేశారు.. గతేడాదిగా మొత్తంగా వారికి జీతాలు అందలేదనే విమర్శలు ఉన్నాయి. 

ఈ పరిణామాలతో ఉన్నతాధికారులు ఉద్యోగులను తొలగించాలని సూచించారు. కానీ వారిని తీసేయలేదు. అంతేకాకుండా జీతాలు కూడా ఇవ్వలేదు.. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో జీతాల బకాయిలు అందించే పనిలో ఉన్నారు. మిగతా ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమానంగా ఉద్యోగ భద్రత కూడా కల్పించనున్నారు.

Also Read :  కమెడియన్ అవినాష్ కు సీరియస్.. బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు