AP: ఏపీలో మందుబాబులకు అదిరిపోయే శుభవార్త.. రెండు రోజులు పండగే పండగ

ఆంధ్రప్రదేశ్‌లో నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళ, బుధవారాల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకూ మద్యం విక్రయించుకునేందుకు ఎక్సైజ్‌ శాఖ అనుమతిచ్చింది.

New Update
liquor

Ap: ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం అదిరిపోయే వార్త చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం ప్రియులకు ఓ బంపరాఫర్ ప్రకటించింది. మద్యం అమ్మకాల సమయాన్ని ఎక్సైజ్‌ శాఖ పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డిసెంంబర్ 31న, జనవరి 1న మద్యం షాపులు, బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు రాత్రి ఒంటిగంట వరకు పని చేసేందుకు అనుమతులు ఇచ్చారు.

Also Read: Maharashtra: కేరళ మినీ పాకిస్థాన్.. అందుకే రాహుల్, ప్రియాంక గెలుపు: బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రతి రోజూ రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఉన్నసంగతి తెలిసిందే. కానీ కొత్త సంవత్సరం వేడుకలు ఉండటంతో.. మద్యం అమ్మకాలు  ఎక్కువగా ఉంటాయి.అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకేముంది పండగ చేసుకుందాం మావ అంటు చిందేస్తున్నారు అంటున్నారు మద్యం ప్రియులు.

Also Read: Cricketers Retirement: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్‌మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు

మరోవైపు కొత్త సంవత్సరం సందర్భంగా బయటి రాష్ట్రాల నుంచి మద్యం ఏపీలోకి రాకుండా ఎక్సైజ్‌ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. దాదాపు 2 రోజులపాటు సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు, బోర్డర్‌ మొబైల్‌ పెట్రోలింగ్‌ పార్టీలను అలెర్ట్‌ చేశారు.

Also Read: TG Crime: గురుకులాల్లో ఆగని మరణాలు... ఖమ్మంలో మరో విద్యార్థి ఆత్మహత్య

రాష్ట్రంలోకి పొరుగు రాష్ట్రాల మద్యం రాకుండా తనిఖీలను ముమ్మరం చేయాలని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మ అధికారులకు ఆదేశలిచ్చారు ప్రతి చెక్‌పోస్టు, మొబైల్‌ పార్టీ పెట్టాలని.. షిఫ్టుల వారీగా రాత్రీ పగలు తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.

Also Read: South Korea: ఫ్లైట్ అంటే భయపడుతున్నారు..68వేల బుక్సింగ్స్ క్యాన్సిల్

అలాగే కొత్త సంవత్సరం పేరుతో అదనపు వసూళ్లు చేసేవారిపైనా నిఘా పెట్టారు ఎక్సైజ్‌శాఖ అధికారులు.మరోవైపు ఏపీలో లిక్కర్‌ సేల్స్‌ విపరీతంగా పెరిగాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.6312 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ 75 రోజులలో మొత్తం 26,78,547 కేసులు బీర్ల అమ్మకాలు అయ్యాయి.

 అలాగే 83,74,116 కేసుల మద్యం విక్రయాలు జరిగినట్లు తెలిపారు. మద్యం షాపులు, బార్లు కలిపి ఈ అమ్మకాలు జరిగాయని అధికారులు వివరించారు.డిసెంబర్ 31, జనవరి 1కి సంబంధించి వచ్చిన ఇండెంట్ బట్టి స్టాక్ పంపుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. డిసెంబర్‌ 30, 31.. 2025 జనవరి 1న మద్యం అమ్మకాలు మరింత భారీగా పెరుగుతాయని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: సీఎం రేవంత్ కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు.. అలా చేశారేంటి?

నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ ముగ్గురు.. ఎందుకు రాలేదన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

New Update

మంత్రివర్గ విస్తరణ అంశం తెలంగాణ కాంగ్రెస్ కు, సీఎం రేవంత్ కు తలనొప్పిగా మారింది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు స్వరం పెంచారు. తమను అడ్డుకుంటున్న వారిపై, హైకమాండ్ తీరుపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సారగ్ రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. వివేక్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ కు మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించాలంటూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరు కాలేదనే అంశం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వంపై అలిగే వీరు హాజరుకాలేదా? అన్న చర్చ సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. నిన్నటి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మంత్రివర్గం విస్తరణను అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీ లైన్‌ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment