/rtv/media/media_files/2025/02/18/Cjtf1QcWBHtDifCfDKGU.jpg)
knife Murder
AP Crime: ఏలూరు జిల్లా నిడమర్రు యువకుడి హత్య కేసు కొలిక్కి వచ్చింది. బావాయిపాలేనికి చెందిన మజ్జి ఏసురాజు ఇటీవల హత్యకు గురయ్యాడు. కాల్వరేవులో సగం చేయి తెగిపోయి రక్త స్త్రావంతో ఏసురాజు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేశారు. యువకుణ్ని ఎవరు హత్య చేసి ఉంటారా..? అనే దానిపై దర్యాప్తు జరిపిన్నారు. పోలీసుల విచారణలో చివరకు ఓ అసలు కారకులను గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగానే ఏసు రాజు హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
Also Read : నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్ రాయల్ సంచలన ఆడియో!
ముగ్గురు అరెస్ట్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య ఫోన్‌తో పొద్దస్తమానం మెసేజులు పెడుతున్నాడని.. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంగానే ఏసు రాజును మహిళ భర్త ఈ హత్య చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఏసు రాజు ప్రియురాలు భర్త, అతని తండ్రితో పాటుగా మరో వ్యక్తి వీరికి సహకరించినట్లు గుర్తించారు. అలాగే కనిపించకుండా పోయిన మృతుడి కుడి చేయిని పోలీసులు గుర్తించారు. భార్యతో సంబంధం మానుకోవాలని ఏసు రాజును ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినా వినకపోవటం.. మళ్లి, మళ్లి మెసేజులు పెడుతూ ఉండటంతోనే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది.
Also Read : ఈ చిట్కాలు పాటిస్తే.. మీ కంటి చూపు సేఫ్!
ఉండి మండలంలోని అత్తగారింట్లో భార్యతో ఏసు రాజు ఉండటం ఆమె భర్త చూశాడు. కోపం పట్టలేకపోయిన మహిళ భర్త.. ఈ విషయాన్ని తండ్రికి చెప్పాడు. ఈ ఇద్దరూ కలిసి మరో వ్యక్తి సహాయంతో ఏసురాజును బావాయిపాలెం రప్పించారు. అక్కడే ఆమె భర్త కుడి చేతిని నరికివేశాడు. ఆ చేయి భాగాన్ని దూరంగా విసిరేశారు. అనంతరం ఏసు రాజును కాపవరం పంట కాలువ రేవులో పడవేసి పారిపోయారు. అయితే.. చేయి నరికి వేయటంతో తీవ్ర రక్తస్త్రావం కారణంగా ఏసురాజు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Also Read : బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే..ఈ వివరాలు మీ కోసమే!
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?