AP EAPCET 2025: ఏపీ ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

AP EAPCET2025 నోటిఫికేషన్‌ను JNTU కాకినాడ రిలీజ్ చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 15నుంచి ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, 21-27 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి.

New Update
ap eap set 2025 notification released application started from march 15

ap eap set 2025 notification released application started from march 15

ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AP EAP Cet 2025 నోటిఫికేషన్‌‌ను JNTU కాకినాడ రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కంప్యూటర్ బేస్డ్‌ పరీక్ష ద్వారా ఈఏపీ సెట్ 2025 నిర్వహిస్తారు.

Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

 ఈ AP EAPCET 2025కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ మార్చి 15వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అర్హత, ఆసక్తిగత స్టూడెంట్స్ ఏప్రిల్ 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు.. 21 నుంచి 27 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే.. సింగిల్ పేపర్‌కు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500.. ఇతర అభ్యర్థులకు రూ.900 ఫీజుగా నిర్ణయించారు. 

Also Read: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం

అదే సమయంలో రెండు పేపర్లకు అప్లై చేసుకోవాలంటే ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 1000 ఫీజు.. మిగిలిన అభ్యర్థులు రూ.1800 చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని గవర్నమెంట్, ప్రైవేట్ ఇంజనీరింగ్‌ కళాశాలలతో పాటు ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం ఈ సెట్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మార్చి 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి. 

Also Read: రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో బిగ్ ట్విస్ట్ .. ప్రోటోకాల్‌ దుర్వినియోగం వెనుక సవితి తండ్రి

                             పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

Also Read: ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment