Rain Alert : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, యాదాద్రి- భువనగిరి, మంచిర్యాల జిల్లాల్లో తెల్లవారు జామునుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పంటలు పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. శివారు ప్రాంతాలైన ఘట్‌కేసర్, చర్లపల్లి తదితర ఏరియాల్లో మోస్తరు వర్షం పడుతోంది.
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
తెలంగాణలో హైదరాబాద్, కొన్ని జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం వేళల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఎండవేడిమి నుండి కొంత ఉపశమనం కలిగించవచ్చు, కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.ఈ ఆదివారం ఉదయం వేళనుంచి ఉత్తర తెలంగాణలో కొంత మోస్తరు వానలు కురుస్తున్నాయి. తిరిగి సాయంత్రం వేళ హైదరాబాద్, ఆ చుట్టుపక్కల వాన మొదలై.. రాత్రి 8 గంటల వరకూ కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణపై రోజంతా మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి. గాలి వీచినప్పుడు ఉపశమనంగా ఉంటుంది.
Also Read : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం.. ఈ ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో రోజంతా మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి. మధ్య మధ్యలో ఎండ కూడా వస్తూ ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో వాన మొదలై.. క్రమంగా పెరుగుతూ.. భారీ వర్షంగా మారి.. రాత్రి 7 వరకూ కురిసే అవకాశాలు ఉన్నాయి. రాత్రి 8 తర్వాత పశ్చిమ రాయలసీమలో జల్లులు పడే ఛాన్స్ ఉంది. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 18 కిలోమీటర్లుగా ఉంది.
Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!
ఏపీలో గంటకు 11 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్లుగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఏపీలో ఉత్తరాంధ్రలో 35 డిగ్రీల సెల్సియస్, కోస్తాలో 38, రాయలసీమలో 40 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. తెలంగాణలో 37 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. చెప్పాలంటే ఇవాళ తెలంగాణలో ఉష్ణోగ్రతలు కొంత తక్కువగానే ఉంటాయి.
Also Read : Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!