/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu-1.jpg)
BIG BREAKING: పేదలకు ఏపీ సీఎం చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.అవసరాని బట్టి పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో వర్చువల్ వైద్యసేవలు అందించనున్నారు. \
మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్..
ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 175 నియోజకవర్గాల్లో 100 పడకలకుపైగా సామర్ధ్యం ఉన్న ఆస్పత్రులు ఇప్పటికే 70 ఉండగా మరో 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలన్నారు. ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వైద్యసేవల్ని మరింత విస్తృత పరచాలని, అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
ఇక ప్రపంచ దేశాలన్నీ వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. విద్య-వైద్య రంగాలు తమ ప్రాధామ్యాలుగా చెప్పిన ఆయన.. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రోగులకు వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలు అందేలా చూడాలన్నారు. అన్యారోగ్యం బారిన పడిన తర్వాత వైద్యసేవలు అందించే పరిస్థితి నుంచి.. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. రూ.32.5 కోట్లతో 25 డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లను సేవలు పెంచడంతోపాటు కొత్తగా మరో 13 డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
Also Read: వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి
ఏజెన్సీ ఏరియాలోని పీహెచ్‌సీల్లో వైద్య ఖాళీల భర్తీ, విజయనగరంలో కొత్తగా 8 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై సమీక్షించారు. ఎన్టీఆర్, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో డయాలసిస్ మెషిన్లు పెంచడం, కొవ్వూరు-నిడదవోలు సీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేయడం తదితర అంశాలపైన మార్గదర్శకాలు జారీ చేశారు. కుప్పం డిజిటల్ నెర్వ్ సెంటర్ (DiNC) పురోగతి గురించి ఆరాతీశారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ అందించడానికి డిజిటల్ నెర్వ్ సెంటర్ దోహదపడుతుందని, దేశంలోనే అత్యధికంగా 4.47 కోట్ల (88 శాతం) మందికి రాష్ట్రంలో అభా కార్డులు జారీ అయ్యాయని తెలిపారు.
cm-chandrababu | hospitals | telugu-news | today telugu news