AP Teacher Jobs: ఏపీలో మెగా డీఎస్సీ.. శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు!

ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. 16,384 టీచర్ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. కొత్త టీచర్లతోనే వచ్చే విద్యాసంవత్సరాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

New Update
CM Chandrababu Naidu approves 190 new ambulance vehicles in AP

CM Chandrababu Naidu approves 190 new ambulance vehicles in AP

ఏపీలో 16,384 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ రోజు అసెంబ్లీలో చంద్రబాబు ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రిక్రూట్మెంట్ పూర్తి చేసి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ లు ఇస్తామన్నారు. ఆ తర్వాతనే వేసవి సెలవుల తర్వాత స్కూళ్లను తిరిగి ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే రైతు భరోసా స్కీమ్ ను ప్రారంభిస్తామన్నారు. మూడు విడతల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు.

ప్రతీ హామీని నెరవేరుస్తున్నాం..

ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతున్నామన్నారు. సూపర్ సిక్స్ లో భాగంగా, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దీపం పథకం కింద పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. 48 గంటల్లో లబ్ధిదారులకు కట్టిన డబ్బు తిరిగి చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ.2,684 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. ఈ స్కీమ్ కోసం కోటిమంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా 93 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో తాను దీపం పథకం తెచ్చానని గుర్తు చేశారు. 

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నీ అమలుచేస్తామని స్పష్టం చేశారు. అనుక్షణం తాము ఇచ్చిన హామీలు కోసం పని చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.1000 పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఇదన్నారు. ఏడాదికి రూ.33 వేల కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నాం 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

AP News: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ అండగా ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు!

అమరావతి రాజధానికి మోదీ సర్కార్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. ఏపీకి కేంద్ర సహాయంపై ఓ వీడియో రిలీజ్ చేశారు.

New Update
AP News: జగన్ ఆ గాయాలపై ఆత్మపరిశీలన చేసుకో.. పురందేశ్వరి సంచలన కామెంట్స్!

Purandeshwari

AP News: అమరావతి రాజధానికి మోడీ సర్కార్ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు కేంద్రం అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు కేంద్రం మంజూరు చేసినట్లు వెల్లడించా. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో డబుల్ ఇంజన్ సర్కార్ కు ప్రజలు పట్టం కట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. అమరావతి నిర్మాణానికి, అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ చెప్పినట్లు గుర్తు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.  

Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం..

వరల్డ్ బ్యాంకు ద్వారా 15వేల కోట్లు, హడ్కో కింద 11వేల కోట్లు ఏపీకి అందించడానికి నిర్ణయం చేశారు. హడ్కో కింద 11వేల కోట్ల రూపాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో నేడు ఒప్పందం చేసుకున్నారు. 15వేల కోట్లు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు కలిపి 13వేల 600కోట్లు ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1400కోట్లు  అందిస్తుంది. ఈ 15వేల కోట్లు మొబలైజేషన్ లో 25శాతం గ్రాంట్ కింద ఇస్తామని కేంద్రం చెప్పిన విధంగా ఇటీవల 4వేల 285 కోట్లు  కేంద్రం అందించింది. కేంద్రం నుంచి వచ్చే సహకారాన్ని అందిపుచ్చుకుంటూ అమరావతిని అద్భుతంగా అభివృద్ది చేయాలని కోరుతున్నాను అని పురంధేశ్వరి వివరించారు. 

Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

bjp-purandeswari | amaravathi | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు