/rtv/media/media_files/2025/03/20/nJzXU7ymGztqJHM2zL74.jpg)
CM Chandra Babu Family
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబంతో కలిసి ఈరోజు, రేపు తిరుమల పర్యటనకు వెళ్ళనున్నారు. ఈరోజు రాత్రి 10.30 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని రేపు ఉదయం 8 గంటలకు దర్శన చేసుకుంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దగ్గరుండి చూసుకుంటారు. అలాగే దర్శనం తర్వాత కుటుంబ సభ్యలతో కలిసి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకుని...అక్కడి భక్తులకు స్వయంగా తన చేతులతో అన్న ప్రసాదాలను వడ్డించనున్నారు ఏపీ సీఎం.
దేవాన్ష్ పుట్టినరోజు ఆనవాయితీ..
ప్రతీ ఏడాది మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజున లేదా ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సీఎం చంద్రబాబు నాయుడు కుటంబానికి అలవాటు. ఈ ఏడాది కూడా దానిని పురస్కరించుకునే తిరుమలకు వస్తున్నారు. ఇక నారా దేవాన్ష్ పుట్టినరోజు నాడు (మార్చి 21) అన్నప్రసాద కేంద్రంలో అయ్యే ఖర్చు రూ.44 లక్షలను సీఎం భరించనున్నారు. రూ. 44 లక్షలను టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా అందించనున్నారు.
Also Read: IPL 2025: ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ