/rtv/media/media_files/2025/04/03/eGaK2T1WDpyLptR3CdKT.jpg)
AP Cabinet meeting
AP Cabinet: ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 7 కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఇకపై రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా APDC వ్యవహరించనుంది. ఈ మేరకు ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను (APDC) ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (APSFL) నుంచి తొలగించి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం అమోదించింది.
ఆమోదం పొందిన 7 అంశాలు..
ఆమోదం పొందిన 7 అంశాల వివరాలు ఇలా ఉన్నాయి. 1.అనకాపల్లి జిల్లాలోని డీఎల్‌పురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 2.పర్యాటకానికి ఊతం ఇచ్చేలా త్రీ స్టార్, తదితర హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల తగ్గింపు. బార్ లైసెన్స్‌ల ఫీజు రూ.25లక్షలకు ఆమోదం. 3.యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్. 4.రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు అంగీకారం. 5. ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు-2025కు అమోదం. 6.నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. 7.జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయనున్నారు.
క్యాప్టివ్ పోర్టు నిర్మాణం..
ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ కార్పోరేషన్ క్యాప్టివ్ పోర్టు నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం కాకినాడ గేట్ వే పోర్టు నిబంధనలను సవరించేందుకు కూడా కేబినెట్ అంగీకరించింది. రెండు దశల్లో అర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రూ.1.35 లక్షల కోట్ల వ్యయం తో నిర్మించనుండగా.. క్యాప్టివ్ పోర్టు 2.9 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ ఉండేలా అనుమతి లభించింది. రెండు దశల్లో క్యాప్టివ్ పోర్టు నిర్మాణం కోసం సుమారుగా రూ. 11 వేల కోట్లు పెట్టుబడి కానున్నట్లు అంచనా వేశారు. దీంతో 6 వేల మందికి పైగా ఉపాధి లభించనుందన్నారు.
Also Read: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణశాఖ కీలక ప్రకటన!
హడ్కో నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ. 710 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఏపి జెన్కో, నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ లకు ఆర్బిట్రేషన్ అవార్డుగా రూ. 1735 కోట్లు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదించింది. ఇక పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును సాకారం చేసేలా ఓ కొత్త సంస్థ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Also Read: సుప్రీం న్యాయమూర్తుల సంచలన నిర్ణయం.. ఆస్తుల ప్రకటన!
జలహారతి కార్పొరేషన్ పేరిట ఓ ఎస్పీవీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.85 వేల కోట్ల మేర ఈ ప్రాజెక్టుకు నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు. చింతల పూడి లిఫ్ట్ లైనింగ్ పనులపై విచారణకు కేబినెట్ లో నిర్ణయం జరిగింది. గతంలో దీనికి రూ.44 కోట్లు వ్యయం అయినట్లు తెలిపారు. ఐఏఎస్ అధికారుల ఏప్రిల్ నెలలో మూడు రోజుల పాటు పల్లె నిద్ర చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి అధికారులు ఓ రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మీడియా అక్రెడిషన్ ల విషయంపై మరికొంత సమాచారంతో తదుపరి కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ap-cabinet | cm chandraabu | today telugu news