ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన రోజే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ నిధులు సైతం రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సైతం ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డయాఫ్రంవాల్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని నిర్ణయించింది. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించిన సందర్భంగా కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్ తీర్మానించింది.
ఇది కూడా చదవండి: Chandrababu: ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ..సీఎం చంద్రబాబు
రేపు రాష్ట్రానికి వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం పలకాలని కేబినెట్ నిర్ణయించింది. అమిత్ షా కు సీఎం నివాసంలో డిన్నర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. డిన్నర్ కు డిప్యూటీ సీఎం, లోకేష్, హోం మంత్రి అనిత, సత్య కుమార్ కు ఆహ్వానించనున్నారు. ఇంకా కూటమిలోని మూడు పార్టీల నేతలు ఈ డిన్నర్ కు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: AP Govt Jobs 2025: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త.. 26,263 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
కేంద్రంతో సమన్వయం..
మంత్రివర్గ సమావేశం తర్వాత.. మంత్రులు, ఎంపీలు జోనల్ ఇంచార్జిలతో చంద్రబాబు తన నివాసంలో సమావేశం అయ్యారు. నామినేటెడ్ పదవులు, టీడీపీ సభ్యత్వానికి సంబంధించి అంశాలపై చర్చించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని, కొన్ని శాఖలకు సంబంధించి ఎంపీలు దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేలా ఈ మీటింగ్ లో కార్యాచరణ రూపొందించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లేలా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.