AP BJP: బీజేపీ విజయంపై పురంధేశ్వరి సంచలన కామెంట్స్.. విధ్వంసాలు, కక్షలతోనే అంటూ!

దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయమని ఏపీ బీజేపీ ఛీఫ్ పురంధేశ్వరి అన్నారు. బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 27ఏళ్ల తర్వాత ఢిల్లీలో సాధించిన విజయం బీజేపీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

New Update
ap bjp

AP BJC Chief Purandeshwari

AP BJP: దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ రాజకీయ పార్టీలా ఉండదు కుటుంబంగా కలుపుకొని వెళ్లే పార్టీగా ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో బీజేపీలో చేరడానికి చాలామంది ముందుకు వస్తున్నారన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసిన ఆమె.. పార్టీలో చేరినవారు ఖండువా వేసుకోవడం కాదు పార్టీ ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాలని సూచించారు. 

బీజేపీ కార్యకర్తలకు అంకితం..

ఢిల్లీలో 27 సంవత్సరాలు తరువాత బీజేపీ జెండా ఎగిరింది. ఈ విజయాన్ని బీజేపీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నాం. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతో బీజేపీ ఘన విజయం సాధించింది. డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి జరుగుతుందని ఢిల్లీ ప్రజలు బీజేపీకి విజయాన్ని అందించారు. బీజేపీకి ఘన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు. బీజేపీ విజయాన్ని ఢిల్లీ ప్రజలకు అంకితం చేస్తున్నాం. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

విధ్వంసాలు, కక్షలతోనే పాలన..

ఇక ఏపీలో గడిచిన ఐదు సంవత్సరాలలో విధ్వంసాలు, కక్షలతోనే పాలన సాగించారన్నారు. కేవలం తమ జేబులు నింపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కూటమికి అనూహ్య విజయం అందిచారని, రాష్ట్రంలో ఏవిధంగా మద్యం స్కాం జరిగిందో అదే తరహాలో ఢిల్లీలో మద్యం స్కాం జరిగిందన్నారు. ఢిల్లీలో అప్ కు ప్రజలు గుణపాఠం చెప్పారు. అందరికి సమాన అవకాశాలు ఇవ్వాలనే రాజ్యాంగ స్ఫూర్తితో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బిడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు అంగీకరించడం లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి ఏవిధంగా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాలతో నడిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. గడిచిన ఐదు ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కు చిటికెడు మట్టి వేయలేదు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందని గుర్తు చేశారు. 

ఇది కూడా చదవండి: West Bengal: వెస్ట్‌ బెంగాల్‌లో అనుమానస్పద రేడియో సిగ్నల్స్.. ఉగ్రకుట్రనా ?

అలాగే గత ఐదేళ్లలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని బీజేపీ ముందు నుంచి చెబుతుంది. ఆత్మగౌరవాన్ని నిబెట్టే విధంగా బ్రిటిష్ కాలంలో పెట్టిన వాల్తేర్ డివిజన్ పేరును విశాఖ డివిజన్ గా మార్చామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో రోడ్డు మరమ్మతులు, నిర్మాణాలు చేస్తున్నాం. కెకెలైన్, ఆరుకు రైల్వే స్టేషన్ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఆరుకు రైల్వేస్టేషన్ ను వదులుకొనే పరిస్థితి లేదని, విశాఖ డివిజన్ లో కొనసాగించే విధంగా ప్రయత్నం చేస్తామని ఆమె చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Suspicious deaths : శ్రీకాకుళం జిల్లాలో దారుణం..నిన్న కూతురు..ఈ రోజు అమ్మ..అమ్మమ్మ

విజయనగరం జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు శ్రీకాకుళం జిల్లాలోని ఒక బావిలో శవాలై తేలారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది. వీరిని డెంకాడకు చెందిన వరలక్ష్మి (కూతురు), సరస్వతి (తల్లి) గా గుర్తించారు.

New Update
death

Suspicious deaths in srikakulam

Suspicious deaths : విజయనగరం జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు శ్రీకాకుళం జిల్లాలోని ఒక బావిలో శవాలై తేలారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన వరలక్ష్మి (కూతురు), సరస్వతి (తల్లి) ఇద్దరూ  శ్రీకాకుళం జిల్లా రాగోలు మండలం గూడెం గ్రామం వద్ద బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.  అయితే వీరి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది.

Also read :  Subham Trailer పెళ్ళాల సీరియల్ పిచ్చికి బలైన మొగుళ్ళు.. సామ్ స్పెషల్ ఎంట్రీ అదుర్స్! ట్రైలర్ చూశారా
 
 ఈ నెల 24 వ తేదీన విశాఖ జ్ఞానాపురం చెర్చిలో వరలక్ష్మి కుమార్తె చంద్రిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక ముఖానికి చున్నీ చుట్టి, నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు ఉండడంతో ఆ బాలిక మృతి కలకలం రేపింది. అంతకు ముందు ఆ బాలికకు గాలి సోకిందని చర్చికి తీసుకువెళితే నయమవుతుందని ఆమె తల్లి, అమ్మమ్మ చర్చికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఏమైందనేది తెలియదు కానీ ఆ బాలిక మరణించింది. అయితే, తనకు తెలియకుండా తన కూతురును చర్చికి తీసుకెళ్లారని బాలిక తండ్రి నిన్నటి రోజున ఆరోపించాడు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు పోలీసులు బాలిక తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకుని విచారణ చేసి వదిలేశారు.

Also Read: CSK : పెద్ద ప్లేయర్స్ ఆడటం లేదు..నేనేం చేయాలి..ధోని

అయితే కుమార్తె మృతిపై విశాఖ పోలీసులకు వరలక్ష్మినే ఫిర్యాదు చెసినట్లు మరికొంతమంది చెబుతున్నారు. ఈ క్రమంలో  గూడాంలో మృతుల దూరపు బంధువు ఇంటికి వచ్చే క్రమంలో వీరిని హతమార్చి బావిలో పడేశారని ప్రచారం సాగుతోంది.  మరోవైపు తమ కూతురు మరణానికి తనతో పాటు తన తల్లి కారణమని పోలీసులు అనుమానించడంతో పాటు మరోసారి విచారణకు పిలుస్తారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే వారు పోలీసుల కేసుకు భయపడి ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరెవరైనా చంపారా అనేది మిస్టరీగా మారింది.  అయితే బాలిక మృతికి కారణాలు తెలిస్తే వీరిద్ధరి మరణానికి కారణాలు బయటపడుతాయని స్థానికులు అంటున్నారు. 

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

కాగా వీరిద్దరినీ ఎవరో హతమార్చి నేలబావిలో పడేసారని అనుమానిస్తున్న పోలీసులు కి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. విచారణ చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లో మిస్టరీన ఛేదించే పనిలో పడ్డారు. కాగా బావిలో తల్లీ్కూతుళ్ల మృతదేహాలు లభ్యం కావడంతో పరిసర ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Also Read : Chhattisgarh : స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

 

Advertisment
Advertisment
Advertisment