/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-1-jpg.webp)
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర విషయం జరిగింది. టీడీపీ (TDP) ఎమ్మెల్యే తెలుగులో మాట్లాడితే బావుంటుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు (Raghu Rama Krishna Raju) సలహా ఇచ్చారు. అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై మాట్లాడారు. అయితే మధ్యలో ఎమ్మెల్యేకు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు ఓ సలహా ఇచ్చారు.
ఎమ్మెల్యే తన ప్రసంగం మొత్తాన్ని ఇంగ్లీష్‌లో చదివి వినిపించారని.. 'మీరు సభలో తెలుగులో మాట్లాడితే.. అసెంబ్లీ సభ్యులే కాదు.. మీ నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషిస్తారు. మళ్లీ అసెంబ్లీ వేదికగా మాట్లాడినప్పుడు.. సాధ్యమైతే తెలుగులో మాట్లాడండి. ఇబ్బందిగా ఉంటే మీ ఇష్టం' అని అన్నారు. ఎమ్మెల్యే సింధూర రెడ్డిని కూడా సానుకూలంగా స్పందించారు.
Also Read: Ayodhya Ram mandir: అయోధ్య రామ మందిరం పై దాడికి పాకిస్థాన్ ఉగ్ర కుట్ర
AP Assembly 2025
రాష్ట్రానికి అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో మేలు జరుగుతుందన్నారు పల్లె సింధూర రెడ్డి. ఆర్థికాభివృద్ధితో పాటు వ్యవసాయాభివృద్ధికి మంచిదన్నారు. పంచాయతీ రోడ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు జరిగాయంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్జతలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే సింధూరరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారు మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది...
మరోవైపు అసెంబ్లీలో మరో ఆసక్తికర సన్నివేశం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు రాకపోయినా సరే.. వారు అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రులు సమాధానం ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు విద్యా శాఖ మంత్రి లోకేష్, హోంమంత్రి అనితలు సమాధానాలిచ్చారు. సభకు హాజరుకాకపోయినా వారు అడిగిన వాటికి సమాధానాలు చెప్పారు. అయితే సభలో ప్రశ్నలు అడిగిన సభ్యులు లేరని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రస్తావించగా.. 'మీ అనుమతితో సమాధానమిస్తాం' అని లోకేష్ చెప్పారు. వారు కనీసం టీవీల్లో అయినా చూసుకుంటారని రఘురామ అనడంతో.. అలాచేస్తే టీవీలు పగిలిపోతాయేమో అధ్యక్షా అంటూ లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు.
అలాగే ఈ నెలలోనే మెగా డీఎస్సీ ఇస్తామని మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. జీవో-117ను రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్న విధానాలను వివరించారు. ఉపాధ్యాయుల బదిలీల చట్టం, పదోన్నతులు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టత ఇచ్చారు.
Also Read: Trump: పుతిన్ కంటే వాళ్లే యమ డేంజర్.. జాగ్రత్తగా ఉండాలంటూ ట్రంప్ సంచలన పోస్ట్!