/rtv/media/media_files/2025/03/07/Xu01t7GuyZXndtYsF7c2.jpg)
Anchor Shyamala fires at Pawan Kalyan
Anchor Shyamala : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల నిప్పులు చెరిగారు. పవన్ కు పౌరుషం చచ్చిపోయిందా అంటూ కామెంట్స్ చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్యామల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్యామల చేసిన కామెంట్స్ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. శ్యామల మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత నాటి సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. దిశా యాప్ ను ప్రవేశపెట్టి మహిళలకు పూర్తి రక్షణ కల్పించామన్నారు.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
అబద్ధపు హామీలు గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. నాడు పవన్ తెగ ఊగుతూ మాట్లాడారని, ఇప్పుడు మహిళలకు రక్షణ లేదన్న విషయాన్ని గ్రహించి పవన్ మళ్లీ ఊగుతూ మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లల రక్షణ తన బాధ్యతగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేమయ్యారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని స్వయానా పవన్ కళ్యాణ్ చెప్పారని, మహిళా రక్షణకు కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలను విధానాలను ప్రవేశపెట్టిందో చెప్పాలన్నారు. అంతే కాకుండా ఎన్నికల సమయంలో మాట్లాడిన ఆయన మాట్లాడిన వీడియోలను మీడియా సమావేశంలో శ్యామల ప్రదర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నవరత్నాల పథకాలు పూర్తిస్థాయిలో అమలయ్యాయని శ్యామల చెప్పారు.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!
సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసిందని ఆమె దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ ప్రకటించారని.. ఆ హామీలు ఎక్కడ అంటూ శ్యామల ప్రశ్నించారు. ఉచిత బస్సు గురించి సీఎం చంద్రబాబు హామీలు గుప్పించి, ఇప్పుడు కేవలం జిల్లాల వరకే ఉచిత బస్సు అంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసును ఛేదిస్తామని గొప్పలు చెప్పారని, ఇప్పుడు ఆ కేసు ఏమైందంటూ శ్యామల ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మాటలకు క్రెడిబులిటీ లేదని, మహిళా అభ్యుదయం సాధికారత అంటూ గొప్ప మాటలు చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం ఏమయ్యారని ఆమె ప్రశ్నించారు.
Also Read: TG GPO jobs: ఉద్యోగాల జాతర.. 10వేల GPO పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్