/rtv/media/media_files/2025/02/14/bNrdGRh4eWiN9hzz0FO7.jpg)
anantapur gutti woman called police after her boyfriend block number
Valentine's Day 2025: వాలెంటైన్స్ డే రోజును ప్రేమ జంటలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాయి. ఒకరినొకరు హగ్‌లు, ముద్దులతో రచ్చరచ్చ చేస్తున్నారు. జీవితాంతం హ్యాపీగా కలిసి ఉండాలని ప్రామిస్‌లు చేసుకుంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం తమ ప్రేమను ఒప్పుకోలేదని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అమ్మాయి నో చెప్పిందని దాడులకు దిగుతున్నారు.
Also Read : మరో మీర్ పేట్.. ప్రేమించిందని బిడ్డను ముక్కలుగా నరికి.. ఆ కసాయి తండ్రి ఏం చేశాడంటే.. !?
అయితే అలాంటిదే తాజాగా జరిగింది. కానీ ఇది కాస్త డిఫరెంట్. అంతేకాదు ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు కూడా. అవును నిజమే.. ఓ యువతి చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది తల్లీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తనతో బాయ్ ఫ్రెండ్ మాట్లాడటం లేదని.. తన ఫోన్ నంబర్‌ను కూడా బ్లాక్‌లో పెట్టేశాడని ఓ యువతి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే ఫోన్ చేసి చెప్పింది. అక్కడితో ఆగకుండా మీరే ఎలాగైనా అతనితో మాట్లాడించాలంటూ పేర్కొంది. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : బిర్యానీ పంచాయితీ.. కస్టమర్లపై హోటల్ యాజమాన్యం దాడి
నా నంబర్ బ్లాక్ చేశాడు
ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తనతో మాట్లాడటం లేదని 100కు ఫోన్ చేసి మాట్లాడింది. తన బాయ్ ఫ్రెండ్ మాట్లాడటం లేదని.. నంబర్ సైతం బ్లాక్ చేశాడని పేర్కొంది. అందువల్ల అతడితో మీరు మాట్లాడి తన నంబర్ ను అన్ బ్లాక్ చేయించండి సార్ అంటూ ఆమె ఫోన్‌లో తెలిపింది.
Also read : Acid Attack News: లవర్స్ డే రోజునే దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి!
ఆ తర్వాత దీంతో గుత్తి పిఎస్ బ్లూ కోల్ట్స్ పోలీసులు ఆమెను సంప్రదించగా.. పోలీసులెవరూ తన ఇంటికి రావద్దని.. నంబర్ అన్ బ్లాక్ చేయిస్తే చాలని ఆ యువతి పేర్కొంది. దీంతో ఆ ఫిర్యాదును కంట్రోల్ రూం నుంచి లోకల్ పోలీస్ స్టేషన్‌కు పంపించారు. అనంతరం ఓ కానిస్టేబుల్ ఆ యువతి బాయ్ ఫ్రెండ్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆపై పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు ఆ యువతికి సూచించారు.