/rtv/media/media_files/2025/04/01/qxoY4KSV13TrNXgCXRgF.jpg)
Anakapalli Vepadu Divya Murder Case
అది 2015వ సంవత్సరం. అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన 31 ఏళ్ల యువకుడు శేఖర్.. 7ఏళ్ల బాలిక వేపాడు దివ్యకు మాయ మాటలు చెప్పి ఎవరూ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. ఆపై బీరు సీసాతో ఆ బాలిక గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశాడు. అప్పట్లో ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ కేసుపై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన యువకుడు శేఖర్‌కు చోడవరం కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది.
ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
ఈ మేరకు చోడవరం 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ ఈ తీర్పును వెల్లడించారు. దాదాపు 10 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం శేఖర్‌పై మోపిన నేరం రుజువు కావడంతో జడ్జి అతడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అయితే చోడవరం కోర్టు చరిత్రలోనే తొలిసారి మరణశిక్ష విధిస్తూ తీర్పునివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
ఏం జరిగింది?
అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన శేఖర్‌కు 7ఏళ్ల బాలిక వేపాడు దివ్య కుటుంబంతో గొడవలు ఉండేవి. వాటిని మనసులో పెట్టుకున్న నిందితుడు శేఖర్.. దారుణానికి ఒడిగట్టాడు. బాలిక వేపాడు దివ్య స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. మార్గ మధ్యలో చిన్నారిని ఆపి ఆమెకు మాయమాటలు చెప్పి బిళ్లలమెట్ల రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం ఆ బాలికను మాటల్లో పెట్టి బీర్ బాటిల్‌తో ఆమె గొంతు కోసి హత్య చేశాడు.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
ఈ ఘటన అప్పట్లో ఏపీలో సంచలనంగా మారింది. అనంతరం బాలిక దివ్య పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడింది శేఖర్ అని నిర్ధారించుకుని అతడిని అరెస్టు చేశారు. ఇలా ఈ కేసుపై 10ఏళ్ల పాటు విచారణ జరిగిన అనంతరం కోర్టు అతడికి మరణశిక్ష విధించింది.
ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
(crime news | chodavaram | latest-telugu-news | telugu-news)