/rtv/media/media_files/2025/03/07/23WCysK6xOQldKwOxN7K.jpg)
Anakapalle Inter student commits suicide by hanging
ఆ యువతి పేరు సృజన. ఆమెది అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామం. తునిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇటీవలే ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగానే నిన్న సెకండ్ ఇయర్ పరీక్ష రాసింది. అనంతరం ఇంటికి వచ్చిన ఆ యువతి.. అప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా.. ముభావంగా ఉంటుంది. ఇక ఇవాళ ఉదయం తన తండ్రి ఒక వేడుకకు వెళ్లాడు.
తల్లి కూడా ఇంట్లో లేకపోవడంతో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి.. ఫ్యాన్‌కు వేలాడుతున్న కూతురిని చూసి చలించి పోయాడు. వెంటనే ఆమెను కిందకి దించి హాస్పిటల్‌కు తరలించారు.
Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!
సూసైడ్ నోట్
అయితే ఆ యువతి అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ యువతి మరణవార్త విన్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే ఆ యువతి ఆత్మహత్య చేసుకునే ముందు ఒక సూసైడ్ లెటర్ రాసి పెట్టింది. అందులో.. అమ్మ నాన్న నన్ను క్షమించండి. నా చావుకి నా అనారోగ్యమే కారణం. అమ్మా ఈ బాధలు తట్టుకోలేక పోతున్నాను.
/rtv/media/media_files/2025/03/07/bO8xZ0AmTwuQtJuEmKOz.jpeg)
Also Read: మనుషులా మానవ మృగాళ్ల.. మహిళను హత్య చేసి, పాదాలకు మేకులు కొట్టి - చేతిపై సూదితో పొడిచి!
దీనివల్ల దేనిమీద దృష్టి పెట్టలేక చాలా బాధపడ్డా. నా కోరిక తీర్చుకోలేనేమోనని.. నాలో నేనే చాలా బాధ అనుభవించా. sorry అమ్మ.. ఎందుకు చనిపోయానో కారణం ఎవరికి చెప్పకండి. నేను బతికుండి ప్రయోజనం లేదు. అదువల్ల నేను చనిపోతునాను. చరణ్, చిన్న మీరు బాగా ఉండండి. మీరంటే నాకు చాలా ఇష్టం. అమ్మని బాగా చూసుకోండి. నాన్నను బాధపెట్టకండి. నాన్న చెప్పిన మాట ఆలకించండి. నేను చనిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. Love you Amma & Nanna and my brothers అంటూ ఆ సూసైడ్ లెటర్‌లో రాసుకొచ్చింది.
Also Read: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న కెప్టెన్.. మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ