Pawan Kalyan: కౌన్ బనేగా కరోడ్‌పతి లో పిఠాపురం ఎమ్మెల్యే పై ప్రశ్న! కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 16 వ సీజన్ రన్ అవుతుంది.తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడగటం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. By Bhavana 14 Sep 2024 | నవీకరించబడింది పై 14 Sep 2024 11:11 IST in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Pawan Kalyan : కౌన్ బనేగా కరోడ్‌పతి గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. ప్రస్తుతం 16 వ సీజన్ రన్ అవుతుంది. ముందు నుంచి కూడా ఈ షోకి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడగటం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ‘2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నటుడు ఎవరు?’ అని ప్రశ్న వేశారు. కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్ పోల్’ ఆప్షన్ తీసుకున్నారు. చాలా మంది 50 శాతం మందికి పైగా పవన్ కల్యాణ్ అని కరెక్ట్‌గా జవాబిచ్చారు. వారు పవన్ పేరు చెప్పి లాక్ చేశారు. దీంతో అది కరెక్ట్ అన్సర్ కావడం వల్ల కంటెస్టెంట్ రూ.1.60లక్షలు గెలిచుకున్నారు. పవన్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే ఆయన నుంచి సుజీత్ ఓజీ, హరి హర వీరమల్లు, హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు రాబోతున్నాయి. ఇవి ప్రస్తుతం షూటింగ్ మధ్య దశలో ఉన్నాయి. ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. త్వరలోనే పున:ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూడు చిత్రాల ప్రచార చిత్రాలు, గ్లింప్స్ మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. Also Read: సంక్రాంతి బండి..మొత్తం ఫుల్లండి! #bollywood #tollywood #ap-politics-2024 #pawan-kalyan సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి