CRIME NEWS: 6 నిమిషాలు.. 106 కి.మీ.. ఉరి వేసుకోబోతున్న యువకుడిని ఏపీ పోలీసులు ఎలా కాపాడారంటే!

ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకుంటున్న ఓ యువకుడిని ఏపీ పోలీసులు కాపాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి చెందిన యువకుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. విషయం తెలిసి పోలీసులు 6 నిమిషాల్లోనే 106 కిలో మీటర్ల దూరంలో ఉన్న అతడిని సేఫ్‌గా రక్షించారు.

New Update
Ainavilli mandal young man suicide attempted

Ainavilli mandal young man suicide attempted

ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోయాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇంతలో 6 నిమిషాల్లోనే 106 కిలో మీటర్ల దూరంలో ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న యువకుడిని పోలీసులు కాపాడి శభాష్ అనిపించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

సెల్ఫీ వీడియో షేర్

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలానికి చెందిన ఓ యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దీంతో ఓ గదిలో ఉరివేసుకునేందుకు సిద్ధమవుతూ సెల్ఫీ వీడియోను తన కుటుంబ సభ్యులకు పంపించాడు.

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

106 కి.మీ. దూరంలో

దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే 11.21 గంటలకు పి.గన్నవరం సీఐకు సమాచారం అందించడంతో పాటు వీడియోను సైతం షేర్‌ చేశారు. వెంటనే ఐటీ కోర్‌ కానిస్టేబుల్‌‌ సహాయంతో లోకేషన్‌ను కనిపెట్టారు. కానీ యువకుని ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో ఫోన్‌ ఐఎంఈఐ ద్వారా సుమారు 106 కి.మీ. దూరంలో అన్నవరంలో ఉన్నట్టు గుర్తించారు.

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

వెంటనే అన్నవరం ఎస్సై శ్రీహరిబాబుకు సీఐ భీమరాజు ఫోన్​లో సమాచారం అందించి వీడియోతో పాటు లోకేషన్‌ను​ షేర్‌ చేశారు. అలా ఫోన్​లో మాట్లాడుతూనే లోకేషన్‌ ట్రేస్‌ చేయాలని సూచించారు. ఇంతలో ఎస్సై తన సిబ్బందిని అప్రమత్తం చేస్తుండటంతో పాటు వీడియోను స్థానిక లాడ్జిలకు వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు.

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

దీన్ని చూసిన ఓ లాడ్జి యజమాని ఎస్సైకు సమాచారం ఇచ్చారు. దీంతో 11.27 గంటలకు హుటాహుటిన లాడ్జికి వెళ్లిన ఎస్సై తలుపులను బద్దలకొట్టి ఉరివేసుకోబొయే యువకుడిని అడ్డుకుని ప్రాణాలను కాపాడారు. అనంతరం ఆ యువకునికి కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు