/rtv/media/media_files/2025/04/07/7v9tnqr1J4RgPaEHnFV4.jpg)
Ambedkar Konaseema Ainavilli Janasena party mandal president attacked party leader
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి జనసేనలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జనసేన పార్టీకి చెందిన ఓ నాయకుడిపై ఆ పార్టీ మండల అధ్యక్షుడు దాడి చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నిన్న మధ్యాహ్నం పి.గన్నవరం పార్టీ ఆఫీసులో మండలం మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో అయినవిల్లి జనసేన నాయకుడు తొలేటి ఉమ, మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ మధ్య ఒక వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదమే ఇప్పుడు ఈ దాడికి దారితీసినట్లు తెలుస్తోంది.
Also read : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో తులం రూ.56 వేలకు?
జనసేనలో భగ్గుమన్న విభేదాలు
అయినవిల్లి జనసేన నాయకుడు తొలేటి ఉమ పై మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ దాడి చేశాడు. అర్ధరాత్రి మండల అధ్యక్షుడు రాజేష్‌తో పాటు పలువురు వ్యక్తులు తొలేటి ఉమ ఇంటిలోకి చొరబడి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో జనసేన నాయకుడు ఉమ, అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు. తలపై బలంగా కొట్టడంతో వారిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Also read : ఏడడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్!
అదే సమయంలో ఉమ అనుచరులు మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ కారును ధ్వంసం చేశారు. ఇక ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా రాజేష్ కారుపై దాడి చేసిన సంఘటనలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read : పెళ్లిలో చెప్పుల గొడవ.. నా కొడకా అంటూ పెళ్లి కొడుకుని ఊతికారేశారు!
Also read : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్
(janasena | latest-telugu-news | telugu-news | crime news)