AP CM: అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోస్ట్ వైరల్!

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ ఘన నివాళి అర్పించారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కోసం అంకితభావంతో కృషిచేద్దామన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు. 

New Update
cm cbn

cm cbn Photograph: (cm cbn )

AP CM: అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామంటూ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. 

దళితాభ్యుదయానికి పునరంకితం..

'ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది' అన్నారు భారతరత్న డా॥ భీంరావు రాంజీ అంబేద్కర్. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దాం. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా , స్వాతంత్రోద్యమ వీరుడిగా... ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందాం. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదాం' అని కోరారు. 

అంబేడ్కర్‌కు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌  తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి సీఎం ప్రాధాన్యమిస్తున్నారన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తామని అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

 భారతీయ సమాజానికి అంబేడ్కర్‌ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేడ్కర్‌ కృషి అమోఘం. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం అని లోకేశ్‌ పిలుపునిచ్చారు.

cm-chandrababu | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: విశాఖలో దారుణం..కత్తులతో పొడిచి దంపతుల హత్య

విశాఖపట్నం దువ్వాడలోని రాజీవ్ నగర్‌లో రిటైర్డ్ డాక్‌యార్డ్ ఉద్యోగి యోగేంద్రబాబు అతని భార్య లక్ష్మి ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. భార్యాభర్తలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

New Update
vishaka crime news

vishaka crime news

AP Crime: విశాఖపట్నం దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్‌లో దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రిటైర్డ్ డాక్‌యార్డ్ ఉద్యోగి యోగేంద్రబాబు మరియు అతని భార్య లక్ష్మి ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. గురువారం రాత్రి 8 నుంచి 9:30 ఘటల మధ్య ఈ దారుణం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భార్యాభర్తలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. దుండగులు ముందుగానే పక్కా పథకం వేసుకొని వచ్చి, లక్ష్మిని బెడ్‌రూమ్‌లో గొంతు కోసి హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా దోచుకుపోయారు.

ఇద్దరి శవాలు రక్తపు మడుగులో..

ఈ సమయంలో భర్త యోగేంద్రబాబు ఇంట్లో ఉండగా, భార్యపై దాడి జరుగుతున్నదాన్ని చూశాడు. ఆమెను రక్షించబోయే ప్రయత్నంలో అతనిపై కూడా దుండగులు కత్తులతో దాడి చేశారు. యోగేంద్ర శరీరంపై 8 కత్తిపోట్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అరవులు వినిపించాయని కొంతమంది స్థానికులు చెప్పినప్పటికీ.. అదేదో కుటుంబ కలహమేనేమో అనుకుని పట్టించుకోలేదని చెబుతున్నారు. దంపతులు నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్‌ నుంచి తిరిగి వచ్చారు. శుక్రవారం సాయంత్రం మేనల్లుడు ఇంటికి వచ్చి తలుపులు తాళం వేసి ఉండటాన్ని గమనించి, స్థానికులను అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా, ఇద్దరి శవాలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.

ఇది కూడా చదవండి: రక్తహీనతతో బాధపడేవారు ఇవి తప్పక తినాలి

దుండగులు హత్య అనంతరం ఇంటికి తాళం వేసి, అక్కడి నుంచి యోగేంద్ర బాబుకి చెందిన స్కూటీపై పరారయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కూటీ మాయం కావడంతోనే ఈ కోణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులు తెచ్చుకున్న కత్తులను కూడా వెంట తీసుకెళ్లడం ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన వెనుక ఖచ్చితంగా ఆస్తి, నగల కోసం జరిగిన దోపిడీ ఉద్దేశమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు.

ఇది కూడా చదవండి: తిరుపతిలో ఏనుగుల భీభత్సం.. రైతును తొక్కి చంపిన గజరాజులు

( ap crime updates | ap-crime-news | ap crime latest updates | latest-news )

Advertisment
Advertisment
Advertisment