AP Crime: ముసలోడికి ఇదేం మాయరోగం..11 ఏళ్ల అమ్మాయిని అలా చేస్తాడా..!

నెల్లూరు జిల్లా బాపట్లలో 65 ఏళ్ల వృద్ధుడు 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. మేనమామ ఇంటికి వచ్చిన బాలికపై పొరుగింటి వృద్ధుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

New Update
Crime : పండగపూట దారుణం.. ఏపీలో బాలికపై గ్యాంగ్ రేప్

AP Crime: ప్రస్తుత కాలంలో బంధువులు, కుటుంబసభ్యుల రూపంలో ఆడవారికి రక్షణ లేకుండాపోయింది. చిన్నారులు,పెద్దలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. కామంతో కళ్ళు నెత్తికి వెక్కిన 65 ఏళ్ల ఓ వృద్ధ కామాంధుడు 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 

ఇది కూడా చదవండి: అమ్మకానికి గూగుల్‌ క్రోమ్‌!

సమాచారం అందుకున్న పోలీసులు..

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా బాపట్ల పట్టణం ఇందిరానగర్‌ కాలనీలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. మేనమామ ఇంటికి వచ్చిన బాలికపై పొరుగింటి వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బంధువుల ఫిర్యాదుతో బాలికను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: మేకపాలతో డెంగ్యూ తగ్గుతుందా?.. ఇందులో నిజమెంత?

పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన బాలిక తల్లిదండ్రులతో కలిసి మేనమామ ఇంట్లో ఓ వేడుకకు వచ్చింది. ఉదయం ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను బడుగు నాగేశ్వరరావు (60) అనే వ్యక్తి ఇంట్లోకి పిలిచి తలుపులు వేసి అత్యాచారం చేసేందుకు  ప్రయత్నించాడు. బాలిక భయంతో కేకలు వేసింది. అమ్మమ్మ, స్థానికులు గమనించి వృద్ధుడి ఇంట్లో ఉన్న బాలికను కాపాడిన్నారు. అనంతరం నాగేశ్వరరావుకు స్థానికులు దేహశుద్ధి చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను చికిత్స నిమిత్తం..ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై డీఎస్పీ , ఐసీడీఎస్‌ పీడీ ఉమా, సీఐ గంగాధర్‌ బాలిక తల్లి, స్థానికులను విచారించారు. బాలికకు వైద్యులు పరీక్షలు చేసి చికిత్స చేశారు. బాలిక పట్ల అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. సమాజంలో ఇలాంటి కామాంధుల భారీన పడకుండా మహిళలు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కామాంధులు రెచ్చిపోతున్న ఈ కాలంలో ఆడపిల్లలను కుటుంబ సభ్యులు కాపాలంటున్నారు. సమాజంలో ఎవర్ని నమ్మోదని పిల్లలకు చెప్పి సక్రమ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందటున్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో కల్తీ దందా.. ఆ ఫేమస్ అల్లం, స్వీట్లు ఎలా తయారు చేస్తున్నారో మీరే చూడండి!

 

ఇది కూడా చదవండి: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు