ఆ వీడియో చూపించి బాలికపై అత్యాచారం.. చివరికి ఏం జరిగిందంటే?

వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలిక గ్యాంగ్‌ రేప్‌నకు గురైంది. ఉదయ్‌కిరణ్, మరో ఇద్దరు మైనర్‌లు కలిసి బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Minor Girl Rape : తెలంగాణలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

అభం సుభం తెలియని బాలికపై కొందరు మైనర్లు రెచ్చిపోయారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. ఏకంగా ముగ్గురు కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ వీడియో చూపించి బాలికను లొంగదీసుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్పొద్దని బెదిరించారు. చివరికి తెగించి ఆ బాలిక కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: అదానీకి వరుసగా షాక్‌లు..కెన్యా ఒప్పందాలు రద్దు

ఆ వీడియో బాలికకు చూపించి

వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలిక తన ఇంటి సమీపంలో ఓ యువకునితో ఒంటరిగా మాట్లాడింది. అది గమనించిన కొందరు మైనర్లు సెల్‌ఫోన్లో రికార్డ్ చేశారు. ఆ వీడియో బాలికకు చూపించి ఉదయ్ కిరణ్ సహా మరో ఇద్దరు మైనర్లు ఆ బాలికను లొంగదీసుకున్నారు. 

Also Read: హిట్ మ్యాన్, టీమ్ ఇండియా కెప్టెన్ వచ్చేస్తున్నాడు..

ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులవుతోంది. కానీ ఆ మైనర్ నిందితులంతా రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న వ్యక్తుల కొడుకులు కావడంతో ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా ఉంది. మొదటిగా వారు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆ ఫ్యామిలీతో బేరసారాలు ఆడినట్లు సమాచారం. వారు ఒప్పుకోకపోవడంతో వారిని బెదిరించినట్లు తెలిసింది. 

Also Read: ఐదు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన ఆర్బీఐ..భారీ జరిమానా

ఇక లాభం లేదని బాధితురాలి తండ్రి కడపలోని ‘దిశ’ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కడప డీఎస్పీ వెంకటేశ్వరులు, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమాకాంత్‌లు విచారణ మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు నిందితులపై చింతకొమ్మదిన్నె సీఐ శంకర్ నాయక్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Also Read: రేవంత్ ప్రభుత్వానికి షాక్..సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment