దేవుడా ఎంత పని చేశావయ్యా.. తెల్లారితే నిశ్చితార్థం.. అంతలోనే!

అనంతపురం తాడిపత్రి మండలంలో విషాదం జరిగింది. వెంకటరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గీత(24)కు ఆదివారం నిశ్చితార్థం కుదిరింది. గోరింటాకు పెట్టించుకుందామని శనివారం తమ్ముడితో కలిసి బైక్‌పై పక్కూరి వెళ్లింది. తిరిగొచ్చే క్రమంలో ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందింది.

New Update
crime,

ఇదొక విషాదకర ఘటన. కంటనీరు తెప్పించే విషాదం. జీవితం పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ యువతి.. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించాలనుకుంది. కానీ ఆమెతో విధి వింత నాటకం ఆడింది. ఆమె తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పెళ్లి తంతుకు సిద్ధమైంది. 

ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!

తెల్లారితే ఎంగేజ్‌మెంట్. దీంతో గోరింటాకు చేతికి పెట్టుకుంటే బంగారు లాంటి భర్త వస్తాడని ఎంతో ఆశ పడింది. అదే క్రమంలో గోరింటాకు పెట్టించుకోవడానికి పక్క ఊరు వెళ్లింది. చేతినిండా గోరింటాకు పెట్టించుకుని మరికొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకోబోతున్నాం అనే సమయంలో మృత్యువు ఆమె పాలిట యమపాషంగా మారింది. రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చూడండి:  ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డి పల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ రెడ్డి, లక్ష్మీదేవిలకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె గీత, మరో కుమార్తె బిందు, కుమారుడు నారాయణ రెడ్డిలు ఉన్నారు. తల్లిదండ్రులు వీరి ముగ్గురినీ బీటెక్ చదివించారు. 

నిశ్చితార్థం కుదిరింది

వీరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనుకున్నారు. కానీ తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పెద్ద కూతురు అయిన గీత(24)కు పెళ్లి చేయాలనుకున్నారు. ఒక మంచి సంబంధం కుదరింది. దీంతో ఆదివారం (ఇవాళ) ఎంగేజ్‌మెంట్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే గోరింటాకు పెట్టించుకోవడానికి గీత తాడిపత్రికి తన తమ్ముడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై వెళ్లింది. 

ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా

గోరింటాకు పెట్టించుకుని తిరిగి తమ గ్రామానికి వస్తున్న క్రమంలో బుగ్గవైపు నుంచి వస్తున్న ఒక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గీత అక్కడికక్కడే మరణించింది. ఇక నారాయణరెడ్డి తలకి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం అనంతపురం పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు.

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు

ఇక త్వరలో పెళ్లి అని ఎంతో సంబరపడిన ఆ కుటుంబంలో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అంతకంటే ముందు నిశ్చితార్థం మరో రోజులో జరగనుండగా.. తన కూతురు మృతి చెందడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దేవుడా ఎంతపని చేసావయ్యా అంటూ రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు