Hyderabad: ముగిసిన ఉమ్మడి రాజధాని కాలపరిమితి.. వాటా కావాలంటున్న ఏపీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కాలపరిమితి ముగియడంతో.. ఏపీ ప్రభుత్వ ఆధినంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే పలు భవనాలు, సంస్థల్లో ఏపీ ప్రభుత్వం వాటా కోరుతోంది. By B Aravind 27 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 2024 వరకు హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు రాజధానిగా ఉంది. అయితే తాజాగా దీని కాలపరిమితి ముగియడంతో.. ఏపీ ప్రభుత్వ ఆధినంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. Also Read: టీడీపీకి మోదీ బంపర్ ఆఫర్.. డిప్యూటీ స్పీకర్ ఆయనకేనా అయితే చట్టం ప్రకారం.. షెడ్యూల్ 9,10లో నమోదు చేయని 12 సంస్థలు, బిల్డింగ్స్‌లో ఏపీ ప్రభుత్వం వాటా కోరుతోంది. ఈ ఆస్తుల విలువ రూ.వేల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ వాటా కోరుతున్న వాటిలో కోఠిలో ఉన్న వైద్య విధాన పరిషత్, HACA భవన్, ఫార్మసీ కౌన్సిల్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, మాసబ్ ట్యాంక్‌లోని CID బిల్డింగ్, ఆదర్శ్‌నగర్‌లో హెరిటేజ్ బిల్డింగ్, ఖైరతాబాద్‌లోని రియల్ ఎస్టేట్ బిల్డింగ్స్, రెడ్‌హిల్స్‌లోని సెరికల్చర్, హర్టికల్చర్ భవనాలు ఉన్నాయి. వీటి నుంచి తమకు వాటా కావాలని ఏపీ సర్కార్ కోరుతోంది. మరోవైపు ఈ ఆస్తులపై ఏపీకి ఎలాంటి హక్కు లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. Also Read: జీవన్ రెడ్డి విషయంలో తప్పు మాదే.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! #andhra-pradesh #telugu-news #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి