Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ లోని కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రైతులకు రైతు భారోసాను అందించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేస్తారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుంది. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూముల సాగుదారులకు కూడా సహాయం అందుతుంది. 1,46,324 మంది అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు దారులు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, పంట హక్కు పత్రాలు పొందిన వారికి ఒక్కొక్కరికి రూ.7,500 జమ కానున్నాయి.

New Update
Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh government Good News for Tenant Farmers: ఆంధ్ర ప్రదేశ్ లోని కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రైతులకు రైతు భారోసాను అందించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేస్తారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుంది. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూముల సాగుదారులకు కూడా సహాయం అందుతుంది. 1,46,324 మంది అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు దారులు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, పంట హక్కు పత్రాలు పొందిన వారికి ఒక్కొక్కరికి రూ.7,500 జమ కానున్నాయి. కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవాదాయ, అటవీ భూముల సాగుదారులకు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మూడు విడతలుగా రూ.13,500 పెట్టుబడి సాయం అందజేస్తున్నారు.

సంక్షేమ ఫలాలు అందాలన్న ఉద్దేశ్యంతో కౌలు కార్డులు:

ఆంధ్ర ప్రదేశ్ లో కౌలు రౌతులకు కౌలు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సీసీఆర్సీ మేళాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వహిస్తూ.. ప్రతి కౌలు రైతుకు రుణంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశ్యంతో పంటల సాగు హక్కు పత్రాలు (కౌలు కార్డులు) అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కౌలు రైతులకు 100% పంట రుణాలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఆర్బీకేలతో అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే.

7.77 లక్షల మందికి ప్రభుత్వం అద్దె కార్డులు జారీ చేసింది:

ఆర్బీకేల ద్వారా ఈ ఏడాది దాదాపు 7.77 లక్షల మందికి ప్రభుత్వం అద్దె కార్డులు జారీ అయ్యాయి. అన్ని వివరాలు రైతు భరోసా పోర్టల్‌ లో ఉన్నాయి. కానీ ముందుగానే ఖాతాలో డబ్బు జమ అవుతుంది. ఈ ఏడాది కౌలు రైతులకు రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కౌలు రైతులకు కౌలు కార్డులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన ప్రతి కౌలు రైతుకు పంట రుణాలతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని అందజేయాలన్నారు.

కౌలు రైతులు హర్షం:

ఈ నాలుగు సంవత్సరాల్లో తొమ్మిది లక్షల మంది కౌలు దారులకు రూ. 6,668.64 కోట్ల పంట రుణాలు అందించగా, వైస్సార్ రైతు భరోసా కింద 3.92 లక్షల మంది కౌలు దారులకు రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. అలాగే 2.34 లక్షల మంది కౌలు రైతులకు రూ.246.22 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని ప్రభుత్వం అందించింది. 1.73 లక్షల మందికి రూ.487.14 కోట్ల పంట బీమా పరిహారం ఉచితంగా అందించింది. ప్రభుత్వం రైతు భరోసా ఖాతాల్లో జమ చేయనుండడంతో కౌలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే జాగ్రత్త!!

Srisailam: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల్లో నష్టం

వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసులో కొత్త ట్విస్ట్.. నెలన్నర తర్వాత కీలక మలుపు!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini Love: ఓరి మీ దుంపల్‌తెగ ఆపండ్రోయ్.. అఘోరీ కోసం వర్షిణీ లవ్ సాంగ్- వీడియో

శ్రీవర్షిణి కొన్ని పాటలను లేడీ అఘోరీకి డెడికేట్ చేసింది. మళ్లీ తాను అఘోరీ చెంతకు చేరుకున్న ఆనందంలో పాటలు పాడింది. మెల్లగ కరగనీ రెండు మనసుల దూరం అంటూ ప్రభాస్ వర్షం మూవీలోని సాంగ్‌ను పాడి అఘోరీకి డెడికేట్ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

New Update

అఘోరీ - శ్రీవర్షిణీ ఎపిసోడ్ మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఓ రేంజ్‌లో నడిచిన వీరి కథ.. ఇప్పుడు మరో మలుపు తిరిగింది. వీరిద్దరూ వీరి నాలుగు నెలల ప్రేమ బంధానికి గుర్తుగా పెళ్లి చేసుకున్నారు. అయితే అది ఒకసారి కాకపోవడం గమనార్హం. వేరు వేరు ప్రాంతాల్లో రెండు సార్లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మొదటి సారి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య వర్షిణీని అఘోరీ బంగారు చైన్‌ వేసి పెళ్లాడింది. ఈ విషయాలన్నీ స్వయంగా వర్షిణీనే బయటపెట్టింది. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అంతేకాకుండా ఇటీవలే గుజరాత్ నుంచి వచ్చి ఫ్యామిలీ దగ్గర ఉన్న వర్షిణీ ఇప్పుడు మళ్లీ అఘోరీ చెంతకు చేరుకుంది. తమను ఎవరూ విడదీయలేరని అంటోంది. తమ ప్రేమకు గుర్తుగా పెళ్లి కూడా చేసుకున్నామని చెబుతోంది. అఘోరీలో జెన్యుటీని చూసి ఇష్టపడ్డానని అంటోంది. అఘోరీతో సె**క్స్‌ను తాను కోరుకోలేదని.. సె**క్స్ కోరికలు తనకు లేవని తెలిపింది. ఇందులో భాగంగానే RTV ఛానెల్‌తో ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో అఘోరీపై ప్రేమను కురిపించింది. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

అఘోరీ కోసం స్పెషల్ సాంగ్ 

అఘోరీ అంటే తనకు ఎంత ఇష్టం..? ఎందుకు ఇష్టమో తెలిపింది. అంతేకాదండోయ్.. అఘోరీ కోసం ఏకంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ పాటలను డెడికేట్ చేసింది. అఘోరీ - వర్షిణీ ఇద్దరూ కారులో ఉండి లైవ్ ఇచ్చారు. అందులో అఘోరీ కోసం వర్షిణీ కొన్ని పాటలు పాడింది. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీలోని వీడు ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఓ సాంగ్ పాడింది. ఆ తర్వాత.. ప్రభాస్ ‘వర్షం’ మూవీలోని మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం అంటూ ఓ సాంగ్ పాడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

(aghori | lady aghori sri varshini relation | sri varshini | Aghori Sri Varshini Lov | aghori sri varshini | latest-telugu-news | telugu-news)

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment