/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/KHK4Vh-xM4-HD.jpg)
AP Assembly Meetings : ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మాజీ సీఎం జగన్ (Ex. CM Jagan) హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన వస్తారని మాజీ మంత్రి పేర్నినాని (Perni Nani) స్పష్టం చేశారు. జగన్‌తో సహా 11 మంది ఎమ్మెల్యేలు వస్తారని.. ప్రభుత్వాన్ని నిలదీస్తారని పేర్కొన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వమిదని.. అసెంబ్లీలో మా వ్యూహాలు మాకున్నాయని అన్నారు.
Also read: గుడివాడలో కొడాలి నానికి బిగ్ షాక్.. ఆఫీసు స్వాధీనం!
ఇదిలాఉండగా.. వైసీపీ (YCP) కి 11 సీట్లు మాత్రమే రావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. దీంతో జగన్ సాధారణ ఎమ్మెల్యేగానే రానున్నారు. అయితే చర్చల్లో పాల్గొనేందుకు జగన్‌కు తగినంత సమయం లభిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే అసెంబ్లీలో ఆయన వ్యూహాం ఏంటి.. ఎలాంటి అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారే దానిపై ఆసక్తి నెలకొంది.
Also read: కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు.. ఇద్దరు నిందితులు అరెస్ట్..!