Vande Bharat: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. తప్పిన పెను ప్రమాదం.!

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్-గయా రైల్వే సెక్షన్ లోని కర్వాండియా రైల్వే స్టేషన్ కు సమీపంలో బనారస్-రాంచీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై కొందరు రాళ్లు రువ్వారు. ఓ కోచ్ కిటికీలు పగిలాయి. ససారం రైల్వే స్టేషన్ దగ్గర్లో ఈ ఘటన జరిగింది.

New Update
Vande Bharat: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. తప్పిన పెను ప్రమాదం.!

Vande Bharat: నాలుగు కిలోమీటర్ల ప్రయాణం అనంతరం అకస్మాత్తుగా ఓ పదునైన రాయి కోచ్ నెంబర్ సీ7 విండోకు తగిలింది. దీంతో కిటికీ అద్దాలు పగిలాయి. రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అధికారులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత దెబ్బతిన్న కిటికీని రైలు ఎస్కార్ బ్రుందం, ఇతర సిబ్బంది పరిశీలించారు. ఈ విషయంపై ఆర్పీఎస్ ఇన్ స్పెకటర్ సంజీవ్ కుమార్ స్పందించారు. రాళ్ల దాడి సమాచారం మేరకు ససారం స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ సుశీల్ కుమార్ విచారణ సందర్భంగా రైలు ఎస్కార్ట్ పార్టీని, ఇతర సిబ్బందిని విచారించినట్లు తెలిపారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ససారం స్టేషన్ నుంచి సాయంత్రం 5.52గంటలకు బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికి దాడి చేయడంతో కోచ్ నెంబర్ సీ 7 కిటికీ అద్దం పగిలినట్లు చెప్పారు.

ఈ విషయమై సీటు నెంబర్ 25లో కూర్చున్న అమరేంద్ర కుమార్ అనే ప్రయాణికుడిని సంప్రదించగా ససారం స్టేషన్ కు 4 కిలోమీటర్ల దూరంలోని కరాబండియా స్టేషన్ కు సమీపంలో అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించిందని ఆ తర్వాత అద్దాలు పగిలిపోయాయని తెలిపారు. అనంతరం రైల్వే సిబ్బంది కూడా కోచ్ దగ్గరకు వచ్చి దెబ్బతిన్న అద్దాలను పరిశీలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నట్లు త్వరలోనే నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు ఇవి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు