Anasuya : పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ.. స్వయంగా బయటపెట్టిన 'జబర్దస్త్ బ్యూటీ'..!

అనసూయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో నెటిజన్లతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ పవన్ కళ్యాణ్ అభిమాని.. మీరు పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఎప్పుడు యాక్ట్ చేస్తారు అని అడిగారు. దీనికి అనసూయ సమాధానమిస్తూ.. ఒక చిన్న పాత్ర చేశాను.. రిలీజ్ అవ్వాలి అని తెలిపింది.

New Update
Anasuya : పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ.. స్వయంగా బయటపెట్టిన 'జబర్దస్త్ బ్యూటీ'..!

Anasuya Bharadwaj In Pawan Kalyan's Latest Movie : అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో నటిగా తానేంటో నిరూపించుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. అటు సోషల్ మీడియా (Social Media) లోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. అప్పుడప్పుడు ట్రోలర్స్‌కు కూడా గురవుతువుంటుంది.

అనసూయ కూడా ఏ మాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ పంచులు వేస్తూ ట్రోల్స్ చేసే వారికి గట్టిగా కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లో నెటిజన్లతో ముచ్చటించగా వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపింది. ఈ క్రమంలో ఓ పవన్ కళ్యాణ్ అభిమాని.. మీరు పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఎప్పుడు యాక్ట్ చేస్తారు అని అడిగారు. దీనికి అనసూయ సమాధానమిస్తూ.. ఒక చిన్న పాత్ర చేశాను.. రిలీజ్ అవ్వాలి అని తెలిపింది.

Also Read : ‘భారతీయుడు’ కోసం కమల్ కు ముందు ఈ తెలుగు హీరోలను అనుకున్నారా?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ ఒక్క షెడ్యూల్ జరిగింది. అది ఎలాగో గ్లింప్స్ లో చూపించారు. దీంట్లో అయితే అనసూయ ఉండే ఛాన్స్ లేదు. అనసూయ పవన్ కళ్యాణ్ OG సినిమాలో ఉందా? లేక హరిహర వీరమల్లు సినిమాలో ఉందా? అనేది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు