West Bengal: జూనియర్ డాక్టర్ శరీరంలో అధిక వీర్యం.. వెలుగులోకి సంచలన నిజాలు పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతాలో జూనియర్ డాక్టర్‌పై సామూహిక హత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టు మార్టం రిపోర్టులో తేలింది. ఒక్కరు హత్యాచారం చేస్తే ఇది సాధ్యం కాదని వైద్యులు చెబుతున్నారు. By B Aravind 14 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆర్‌జీ కార్ వైద్య కళాశాలలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అయితే తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మృతురాలిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె శరీరంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. Also Read: సుంకిశాల ప్రమాదం.. మేఘా కంపెనీకి షాకిచ్చిన ప్రభుత్వం మృతిరాలి రహస్య అవయవాలతో పాటు కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయ్యిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, కడుపు, చేతి వెళ్లపై గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడైంది. ఆమెపై పాశవికంగా దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు వైద్యులు తెలిపారు. ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు గుర్తించారు. కూతురు మృతిపై ఆమె తల్లిదండ్రులు.. కోర్టులో వేసిన పిటిషన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తమ కూతురిపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారం చేసి ఉంటారని ఆరోపించారు. వైద్యులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ మోతాదు కేవలం ఒక్క వ్యక్తికి సాధ్యం కాదని.. ఎక్కువ మంది ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మృతురాలిపై సామూహిక హత్యాచారం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా.. పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఆ జూనియర్ వైద్యురాలు ఆస్పత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం చూసేసరికి ఆస్పత్రి సెమినార్ హాల్‌లో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించింది. దీంతో పోలీసు వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే మృతిరాలికి పోస్టుమార్టం నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. Also Read: ఇంటర్ అర్హతతో రైల్వేలో 11,250 ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలివే! #telugu-news #west-bengal #kolkata #junior-doctors-murder-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి