RTV UnCensored : పవన్ నాలుగో పెళ్లిపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు!

మంత్రి అంబటి రాంబాబు రాబోయే ఎన్నికల్లో ఆయన టికెట్ గురించి, షర్మిల రాజకీయ భవితవ్యం గురించి,పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి గురించి, బ్రో మూవీలో శ్యామ్ బాబు పాత్ర గురించి, ఆంధ్రాలో వైసిపి జోరు గురించి ఇలా అనేక అంశాలపై ఆర్టీవి అన్సెన్సార్డ్ ప్రోగ్రాంలో పాల్గొని ఆసక్తికర సమాధానాలిచ్చారు.

New Update
RTV UnCensored : పవన్ నాలుగో పెళ్లిపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు టు RTV అన్ సెన్సార్..  వెల్కమ్ సర్

ప్రశ్న:అంబటి రాంబాబు గారు..సత్తెన పల్లి నుంచి MLA గా గెలిచిన తర్వాత ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా మీరు కొనసాగుతున్నారు. ఈ సారి మీ టికెట్ డౌట్ అనే మాట వినిపిస్తోంది.నిజంగా ఈసారి మీ టికెట్ డౌటే నా?

అంబటి; డౌటని వినిపిస్తోంది..నేనే పోటీ చేస్తానని కూడా వినిపిస్తోంది.ఈ రెండిటిలో మీకు ఏది బాగా వినిపిస్తోందో నాకు తెలీదు.

ప్రశ్న: మాకు వినిపిస్తున్నది అయితే మాత్రం మీ టికెట్ డౌట్ అనే మాట .. ఎందుకా మాట.

అంబటి: డౌట్ అయితే ఈ పాటికే తేలిపోయేది. డౌట్ లేదనీ అర్థమయ్యేది కదా . టికెట్ కన్ఫర్మ్ చెయ్యాల్సింది లీడర్ .అప్పటి వరకు కన్ఫర్మ్ కదా అనేది రకరకాల మాట్లాడుకుంటారు. ముఖ్యంగా మా జిల్లాలో ఆల్రెడీ సీట్లు మార్చారు. అనౌన్స్ చేశారు. నా సీటు మార్చలేదే.అనౌన్స్ చేయలేదు.దాన్ని బట్టి కొద్దిగా కామన్ సెన్స్ ఉంటే అర్ధమయిపోతుంది.

ప్రశ్న:భవిషత్ లో మారొద్దు అనే దృఢ విశ్వాసంతో ఉన్నారా ?

అంబటి:దృఢమైన విశ్వా సాలేమీ ఉండవు రాజకీయాల్లో. విశ్వాసాలే. దృఢమైన విశ్వాసాలు ఏమీ ఉండవు.ఎపుడైనా మారిపోతాయి. అంబటి రాంబాబుకి టికెట్ సత్తెనపల్లి  ఉంటదో లేదో అనేది ఊరకనే రాజకీయాల్లో చర్చించే అంశాలే తప్ప.కొద్దిగా కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఎవరికయిా అర్థమయ్యే అంశమది.ఇది రాబోయే  కాలం లో మీక్కూడా అర్ధవుతుంది.

ప్రశ్న:అంటే..కామన్ సెన్స్ అంటేనే నాకు తప్పకుండా ఇవ్వాలని చెప్పి అధిష్టానానికి డైరెక్ట్ గా కానీ ఇన్ డైరెక్ట్ కానీ  చెప్పే ప్రయత్నాలు చేశారా?

అంబటి:అస్సలు..అధిష్టాన వర్గాన్ని తప్పనిసరిగా నాకు టికెట్ ఇవ్వాలని , ఏ క్రమ శిక్షణ కలిగిన రాజకీయ నాయకుడు అడగడు.

ప్రశ్న:ఇన్ డైరెక్ట్ గా చెప్పే ప్రయత్నాలు చేశారా?

అంబటి:ఇన్ డైరెక్ట్ గా కాదు. లీడర్ కి లేదా పార్టీ అధిష్టాన వర్గానికి ఎవరు ఎక్కడ నిలబడితే బాగుంటుంది అని భావిస్తే అక్కడ వారిని నిలబెడతారు. ఇది అనాదిగా వస్తున్న వ్యూహం.దాని ప్రకారమే ఈ పార్టీ కూడా ఉంటుంది.

ప్రశ్న:అంబటి రాంబాబు కి సత్తెనపల్లిలో  చాలా ప్రజా వ్యతిరేకత ఉంది. అక్కడ గెలవరు.ఆయనకు టికెట్ ఇవ్వొద్దని మీ పార్టీ నాయకులే విజయవాడకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు? మీరేమంటారు.?

అంబటి;ధర్నాలేం చెయ్యటం లేదే..ఒక వాయిస్ వినిపిస్తున్నారు.రాంబాబు గారికి టికెట్ ఇవ్వొద్దని .అది కొంతమంది అంటున్న మాట ఫాక్ట్. అది ఎన్నికలకు ముందు ప్రతీ రాజకీయ పార్టీలోనూ ఇలాంటి సమ్మతులు, అసమ్మతులు వినిపించడం అనేది ఆనవాయితీగా తయారయిన పరిస్థితి. ఫైనల్లీ లీడర్ విల్ డిసైడ్.దేని మీద డిసైడ్ చేస్తారు. అనేక సందర్భాల్లో చెప్పారు.ప్రతీ నియోజక వర్గాన్ని వివిధ రీతుల్లో సర్వే చేసుకున్న తరువాత ఎవరికి టికెట్ ఇవ్వాలి ..ఎవరికి ఇవ్వకూడదు .ఎవర్ని ఎక్కడికి పంపాలి. ఎవర్ని భవిష్యత్ లో ఇంకో చోటికి పంపాలి.దాని మీద చాలా స్పష్టంగా మా లీడర్ జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది మీకు నాకు, అందరికీ అర్థమవుతుంది. ఆల్రెడే కసరత్తు స్టార్ట్ అయింది.175 అండ్ 25 సీట్స్ ని ఆయన త్వరలో డిక్లేర్ చేయబోతున్నారు.కొన్ని మార్పుల్ని ఆల్రెడీ డిక్లేర్ చేశారు.

ప్రశ్న:కానీ... 5 వ లిస్ట్ కూడా మార్పులు జరిగే దాంట్లో ఉందని అంటున్నారు. ఈ లిస్ట్ లో అంబటి రాంబాబు పేరు ఉండే అవకాశం ఉందా ?

అంబటి:అవకాశం లేదనే అనుకుంటున్నాను నేను. మార్పులు ఉండవనే అనుకుంటున్నాను. నా నియోజక వర్గంలో నేనే పోటీ చేస్తానని అనుకుంటున్నాను.నేను కాదు చెప్పాల్సింది.

ప్రశ్న:ఒకవేళ నియోజక వర్గం మారిస్తే మీరు అంగీకరిస్తారా?

అంబటి:నూటికి నూట యాభై పాళ్లు అంగీకరిస్తాను.నాలాగా అంగీకరించే వాళ్ళు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఉండలేదు. ఉండబోరు.

ప్రశ్న: జిల్లా మార్చినా  సరే ..అంగీకరిస్తారా?

అంబటి:జిల్లాలు మార్చినా , రాష్ట్రాలు మార్చినా  ఒన్స్ లీడర్ డెషిశన్ తీసుకున్న తరువాత దాన్ని శిరసా వహించి ముందుకు వెల్లేట టువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. ఇవాళ కాదు  డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి నా రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఎవరికయినా అర్థమవుతుంది.

ప్రశ్న:మీ పార్టీ నాయకులు కూడా మీ పార్టీని వీడి వెళ్ళి పోతున్నారు మంత్రులు, ఎంపీ లు కూడా వెళ్లిపోతున్నారు ఎందుకని.?

అంబటి:వాళ్ళ ప్రయోజనాలు ఈ పార్టీలో దొరక్కపోతే వెళ్ళిపోతారు.కొంత మంది

ప్రశ్న:పార్టీలో ప్రయోజనాల కోసం ఉంటున్నారా?

అంబటి:అలా పార్టీలో ప్రయోజనాల కోసం ఉండేవారికి వాళ్ళ ప్రయోజనాలు దక్కకపోతే వెళ్ళిపోతారు. నేను పార్టీ ప్రయోజనాల కోసం పని చేసే వ్యక్తిగా నన్ను నేను భావించుకునే వ్యక్తిని కాబట్టి  పార్టీకి ప్రయోజనం ఉన్న చోటే నేను పని చేస్తాను.నేను పని చేయటం వల్ల పార్టీకి ప్రయోజనం లేదనుకుంటే పక్కన నిలుచుంటాను. మళ్ళా సమయం వచ్చినప్పుడు పని చేస్తాను.

ప్రశ్న:మీ ప్రయోజనం ఏంటీ?

అంబటి:అంబటి ప్రయోజనం  పార్టీ ప్రయోజనం.

ప్రశ్న:ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సొంత సోదరి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది.అభివృద్ధి అనేది ఎక్కడో ఒకసారి మా జగనన్న చూపిస్తే చూస్తాను అంటున్నారు నిజంగా మీ పాలనలో అభివృద్ధి అనేది జరగలేదా?

అంబటి:జరిగిందో లేదో రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారు ఐదేళ్ల పాటు. ఇక్కడ సెన్సిటివ్ పాయింట్ ఏంటంటే . ముఖ్యమంత్రి సోదరి ఇవాళ బయటికి వచ్చి ముఖ్యమంత్రిని,  అన్నని విమర్శిస్తోంది ఒక రాజకీయ పార్టీలో. ఇది లిటిల్ బిట్  సెన్సిటివ్ ఇష్యూ. నా బోటోడు కామెంట్ చెయ్యాలంటే కొద్దిగా ఆలోచించుకోవాలిసిన అవసరం ఉంది. ఎందుకంటే ..నేను రాజకీయ జీవితం అంతా రాజశేఖర్ రెడ్డి గారితో గడుపుతూ వచ్చాను.ఇక ముందు జగన్ మోహన్ రెడ్డి గారితో గడపబోతున్నాను. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే   షర్మిలమ్మ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె గా ,జగన్ మోహన్ రెడ్డి గారు జైల్ లో ఉన్నపుడు పార్టీని కాపాడటానికి పాదయాత్ర చేసినటువంటి మహిళగా అపారమైనటువంటి గౌరవం కలిగిన వ్యక్తిని నేను.కానీ. ఇవాళ ఆమె తీసుకున్న డేషిషన్ నూటికి నూరు పాళ్లు తప్పు అని భావిస్తున్నాను.యస్..ఆమెకు రాజకీయాలు కావాలి. రాజకీయాలు కావాలి అంటే ..ఆమె రాజకీయాలు కావాలి అని తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టింది  ఫెయిల్ అయింది..కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది.ఫెయిల్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బతికించాలని ప్రయత్నం చేస్తోంది అని అనుకున్నాం.నేను సూటిగా అడుగుతున్నా..ఆమెను కానీ .ఆమెను బలపరిచే వాళ్ళను కానీ ,కాంగ్రెస్ పార్టీని కానీ అడుగుతా ఉన్నా..కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని అనుకుంటున్నారా? జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీని చంపాలనుకుంటున్నారా?రెండవది మీకు సాధ్యం కాదు. మొదటిది కాంగ్రెస్ పార్టీని బతికించడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు.దీన్ని బట్టి అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాను ఎవరైతే ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో షర్మిలమ్మ ప్రవేశించినపుడు  ,రాజశేఖర్ రెడ్డి గారి వారసులు ప్రవేశించారని చంకలు గుద్దుకుంటున్నారో అందరికీ మనవి చేస్తున్నా. .మీరు కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కాదు ,జగన్ మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీని చంపాలని కుట్ర చేస్తున్నారు..ఈ కుట్ర వల్ల లాభం పొందేది ఎవరో ఒకసారి ఆలోచించండి.. నారా చంద్రబాబు నాయుడే లబ్ది పొందుతారనేది అందరికీ తెలుసు.కుట్రలో మీరు భాగస్వాములైతే జాతి క్షమించదు. రాజ శేఖర్ రెడ్డిగారి ఫాలోయర్స్ క్షమించరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే కాలమే పక్కన పెడుతుంది.అది షర్మిలమ్మ అయినా మరొకరయినా.. మరొకరయినా..వాస్తవాలు, న్యాయాలు, ధర్మాలు ప్రకారం ముందుకు వెళ్లకుండా .. తెలంగాణలో రాజకీయాలు కావాలని వెళ్ళి ఫెయిల్ అయి, ఆంధ్రాలో ఫెయిల్ అయిన కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఎదో చెయ్యాలని ఆవేశంగా ,ఆక్రోశంగా ఓవర్ గా మాట్లాడుతుంటే ప్రజలు రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోవడం లేదు.. ఇది నా అభిప్రాయం ..కాలం నిర్ణయిస్తుందని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను.

ప్రశ్న:షర్మిల గారి ప్రవేశం తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని అంటున్నారా?

అంబటి:ఫలానా సీటు గెలుస్తుందని ఎవరయినా గ్యారంటీ ఇచ్చే వాళ్లంటే చెప్పండి .

ప్రశ్న:రాజకీయాల్లో గ్యారంటీ లు ఉంటాయా?

అంబటి:ఎందుకుండవు..నమ్మకాలుంటాయ్. గ్యారంటీ లేకపోయినా.

ప్రశ్న:అంబటి రాంబాబు జలవనరుల శాఖామంత్రా? లేదా పవన్ కళ్యాణ్ శాఖా మంత్రా?కేవలం పవన్ కళ్యాణ్ ను దూషిస్తూ  మాట్లాడుతారు.

అంబటి:ఐ యామ్ ఎ పొలిటీషియన్ ఫస్ట్. ఐ యామ్ ఎ లీడర్ ఫస్ట్.నాకు ఈ శాఖ ఇవ్వబడింది.రెండున్నర సంవత్సరాలు. ఆ శాఖను చూస్తాను.రాజకీయాలు చూస్తాను .. రాజకీయాలు  మాట్లాడతాను... సరదాలు చేస్తాను, డ్యాన్స్ లు చేస్తాను.నా ఇష్టం..నా శాఖను చూస్తూ అన్నీ చేస్తాను.ఐ యామ్ ఏ పొలిటీషి యన్ .. ఐ యామ్ ఏ ఫ్రీ బర్డ్. జలవనరుల శాఖ ఇచ్చారు కాబట్టి  నా ప్రాజెక్టులు తప్ప నేను రాజకీయాలు మాట్లాడకూడదా? నా ప్రాజెక్టులు తప్ప నేను చంద్రబాబుని విమర్శించకూడదా? నా ప్రాజెక్టులు తప్ప నేను చంద్రబాబుని విమర్శించకూడదా? నా ప్రాజెక్టులు తప్ప రాజకీయాలు అసలు మాట్లాడకూడదా? వాట్ ఈజ్ దిస్ టెల్ మి  ప్లీజ్..చెప్పండి.నేను ఫస్ట్ పొలిటీషియన్ ..దెన్.శాఖ నాదేదయినా సరే..ఈ శాఖ ఉంటుంది..మరో శాఖ ఉంటుంది. లేకపోతే ఖాళీగా కూర్చుంటాను. దట్ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాటర్.(కానీ పవన్ కళ్యాణ్ ను వదలరు అన్నమాటకు)..మీ దండం పెడతాను సర్..పవన్ కళ్యాణ్ నన్ను వడల్లేదా? నేను పవన్ కళ్యాణ్ ను వదల్లేదా? పవన్ కళ్యాణ్ నన్ను కామెంట్ చేసినప్పుడే నేను కామెంట్ చేస్తా .మీరు గుర్తు పెట్టుకోండి.

ప్రశ్న:మొన్న కూడా గంగిరెద్దు తో పోల్చుతూ ట్వీట్ చేశారు మీరు.

అంబటి: చాలా పోలుస్తూ ట్వీట్ చేస్తామండే..వాట్ ఈజ్ దిస్. నా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అతను.అతను నన్ను కామెంట్ చేశాడు. నేను అతన్ని కామెంట్ చేశాను. నేనెప్పుడు కామెంట్ చేశానో చెప్పమంటారా? మీకు తెలీదా?నన్ను సినిమాలోనే పెట్టాడే..శ్యామ్ బాబు అని..పెట్టలేదా? సో..ఇవన్నీ రాజకీయాల్లో  అన్నీ తెలిసిన మీరే అట్లా అడిగితే నేనేం చెప్పాలి.పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకూడదు ..రాజకీయాల గురించి మాట్లాడకూడదు..చంద్రబాబు గురించి మాట్లాడకూడదు..అంటే ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి .పార్ట్ ఆఫ్ ద గేమ్.

ప్రశ్న:రాష్ట్ర మంత్రిగా ఉండి హుందాగా ప్రవర్తించడం లేదు  డ్యాన్సులు చేసి రాష్ట్రం పరువు తీస్తున్నారని చెప్పి మొన్న నటుడు పృధ్వీరాజ్ అంటున్నారు.ఏమయినా డ్యాన్సులు మానేస్తారా? భవిష్యత్ లో.

అంబటి:నేనెప్పుడు డ్యాన్స్ చేశాను. (గుర్తులేనట్టు అటూ ఇటూ చూస్తూ.. సంక్రాంతి రోజు అని గుర్తుచేయగానే)  మీకు మరో సారి చెప్తున్నా..సంక్రాంతి రోజునే డ్యాన్స్ చేస్తా.ఇంకెపుడు చేశానా..బోగీ రోజునే ద్యాన్స్ చేస్తా.ఇంకెప్పుడైన చేశానా? కొత్తగా చేశానా?ఈ డ్యాన్సే చేశానా?  గత రెండు సంవత్సరాలు చేయలేదా?ఈ సంవత్సరం మరింత కసిగా చేశా.ఎందుకో తెలుసా.. ఇలాంటోల్లు అంటున్నారని చేశా. నేను సంక్రాంతికి సంబరాల రాంబాబుని, ఆ రోజు తప్పుకుంటే రాజకీయాల రాంబాబు ని, తప్పా..సరదాగా ఉండటం తప్పా సంక్రాంతికి. చెప్పండి సర్  . ఎక్కడేస్తున్న సర్.నా గ్రామం లో వేస్తున్నాను.నా ప్రజల మధ్యన ,భోగి మంట వేసి,నేనే కాదు డ్యాన్స్ వేసింది..చాలా మంది డ్యాన్స్ చేశారు మా గ్రామస్తులందరూ కూడా నేను పాపులర్ కాబట్టి నా ఒక్క డ్యాన్స్ చూపించారు ఈ సారి  డాన్స్ పొలిటికల్ మిక్సింగ్. అది మిమ్మలందరిని  ఎక్కువ ఆకర్షించింది.ఇది ఎందుకు పొలిటికల్ మిక్సింగ్ అంటే  నన్ను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి ..యస్. నేను. సంబరాల రాంబాబునే. అని చెప్తూ డ్యాన్స్ చేశాను. అది క్యాచీగా ఉంది అంతే.

ప్రశ్న:ఆ డ్యాన్స్ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత చేస్తే బాగుండేది అంటున్నారు? మీరేమంటారు?

అంబటి:ప్రాజెక్టులు పూర్తయిన తరువాత డ్యాన్స్ చేస్తారా? ఇదొక వ్యంగ్యం అయినటువంటి కామెంట్.ఇంకొకటి కూడా చెప్తున్నా  పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్ ఏమన్నారో తెలుసా? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తావు అని  ఒక చెప్పు చూపించి నా బొమ్మ పెట్టారు.వారికి ఏమి సమాధానం చెప్పానో తెలుసా..పవన్కళ్యాణ్ నాలుగో పెళ్లి పూర్తయిన తరువాత చేస్తా అని చెప్పాను.వ్యంగ్యానికి వ్యంగ్యం బ్రదర్.పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదు.ఎప్పుడు పూర్తి చేస్తారు? అని స్ట్రెయిట్ గా ప్రశ్న అడిగితే .సమాధానం చెప్తారు.వ్యంగ్యం గా మాట్లాడితే నా దగ్గర కూడా చాలా వ్యంగ్యం ఉంటుంది.

ప్రశ్న: రాష్ట్రంపై అప్పుల భారం పడిందని; అయినా భూతద్దం పెట్టి చూసినా అభివృద్ధి కనిపించడం లేదని షర్మిల అన్నారు. దీనిపై మీరేమంటారు?

అంబటి:ఆమె కొత్తగా ఏం మాట్లాడలేదు. అవన్నీ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చెప్పిన మాటలే. తెలంగాణలో భూతద్దం మరచిపోయినట్టున్నారు. షర్మిలమ్మ వ్యాఖ్యలకు విలువ లేదు. ఇంతకుమించి నేను వ్యాఖ్యానించను. ఫెయిల్‌ అయిన పార్టీని మరో ఫెయిల్‌ అయిన పార్టీలో విలీనం చేసి ఫెయిల్‌ కాబోతున్నారు. రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె. ఆమె మీద గౌరవం ఉంది. ఆ పార్టీకి విలువ లేదు, భవిష్యత్తు లేదు.

ప్రశ్న:గతంలో "బై బై బాబు" అని షర్మిల అన్నారు. ఇప్పుడు "బైబై జగన్‌" అంటున్నారు. అప్పుడు నమ్మిన జనం ఇప్పుడు నమ్మరా?

అంబటి:నమ్ముతారా? మీరు చెప్పండి.. ఆమేమీ సూపర్‌ పవర్‌ కాదు కదా.. మేం అధికారంలోకి వచ్చే సమయంలో చాలా మంది సహకరిస్తారు. తామే అంతా నడిపామంటే ఎట్లా కుదురుతుంది?

ప్రశ్న:సొంత కుటుంబ సభ్యులే ఇలా పార్టీ నుంచి బయటికొచ్చి విమర్శించడం పార్టీకి నష్టం చేయదా?

అంబటి:ఇవన్నీ ఉడుత ఊపుల్లాంటివి. కాలగర్భంలో కలిసిపోతాయి. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుంది. జగన్‌మోహన్‌రెడ్డిని అధికారం నుంచి దించాలని ప్రయత్నిస్తున్న సవాలక్ష శక్తుల్లో ఈ కాంగ్రెస్‌ శక్తి ఒకటి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదు.. ఎవరినైనా చంపడానికి ప్రయత్నిస్తుంది.. కాలం నిర్ణయిస్తుంది. ప్రజలు అర్థం చేసుకుంటారు.

ప్రశ్న:రాజకీయ విషయాలు కాసేపు పక్కన పెడితే.. గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి చంద్రబాబు హయాంలోనే శంకుస్థాపన జరిగింది. మీ సొంత జిల్లాలోనే పులిచింతల కొట్టుకుపోయి రెండేళ్లయింది. అన్నమయ్య, గుండ్లకమ్మ ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయి. వీటిపై సత్వర చర్యలు ఎందుకు చేపట్టడం లేదు?

అంబటి: పులిచింతల ప్రాజెక్టేమీ కొట్టుకుపోలేదు. అందులో ఒక గేటు కొట్టుకుపోయింది. దానికి మరమ్మతు చేస్తాం. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దాని నిర్మాణం కోసం పరిపాలన అనుమతులు పూర్తయ్యాయి. దాన్ని కూడా ప్రారంభిస్తాం. అది పెద్ద ప్రాజెక్టు. దానిని త్వరలోనే పూర్తిచేస్తాం.

ప్రశ్న:  కన్నా లక్ష్మీనారాయణ మీకు బలమైన ప్రత్యర్థి అనుకుంటున్నారా?

అంబటి:ఎవరైనా బలమైన ప్రత్యర్థే.. అలా అనుకోవడంలో ఏముంది? మేమైతే ప్రతిచోటా గెలుస్తామని అనుకుంటున్నాం.

ప్రశ్న:పోలీసులను అడ్డం పెట్టుకుని రాంబాబు రాజకీయం చేస్తారని మీ ప్రత్యర్థులు చెప్తారు?

అంబటి:నాకు ఆ అలవాటు లేదు. కన్నా లక్ష్మీనారాయణ క్యారెక్టర్‌ వేరు.. నా క్యారెక్టర్‌ వేరు.. ఒకే పార్టీని నమ్ముకుని విశ్వాసపాత్రుడిగా నేను ఉన్నాను. అధికారం కోసం ఆయన ఏ పార్టీలోకైనా వెళ్తారు. ప్రతి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో లేరు. వైసీపీలోకి వస్తానని ప్రకటించి కూడా పార్టీలో చేరలేదు. తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. దానికి కూడా రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లారు. ప్రజలు ధర్మానికి, న్యాయానికి, విశ్వాసానికి ఓటు వేస్తారు.

ప్రశ్న:అంబటి రాంబాబుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారని ఎందుకు ఊహాగానాలు వినిపిస్తున్నాయి?

అంబటి:ఏ రాజకీయ పార్టీలోనూ ఏ అభ్యర్థికీ ఏకగ్రీవం ఉండదు. ప్రత్యర్థులు ఎక్కడైనా ఉంటారు. అది చంద్రబాబు నాయుడికే తప్పలేదు. నాదేముంది? ఇవి రాజకీయాలు. అవతలి పార్టీలో కూడా అదే పరిస్థితి ఉంటుంది.

ప్రశ్న:మీరు చాలా రోజుల క్రితం ఓ సినిమాలో నటించారని ఈ మధ్య ఓ చిత్రం బాగా వైరల్‌ అయ్యింది. దాని గురించి చెప్తారా?

అంబటి: అది సినిమా కాదు. మద్యపాన నిషేధ ఉద్యమ సమయంలో దూరదర్శన్‌లో సారా నిషేధం మీద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ధర్మవరపు సుబ్రహ్మణ్యం నా స్నేహితుడు. ఆయన ద్వారా నేను ఆ ఎపిసోడ్‌లో నటించాను. అది 22సెకన్లు వచ్చింది. దాన్ని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ప్రశ్న:ఇప్పుడు సినిమాల్లో నటించే ఆసక్తి ఏమైనా ఉందా?

అంబటి:నాకు సమయం చాలడం లేదు. ఇక ఆసక్తి ఎక్కడుంటుంది?

ప్రశ్న: సినిమా తీయాలన్న కోరిక ఉందా?

అంబటి:ఆ కోరికైతే ఉంది. మనల్ని అబాసుపాలు చేశారు కాబట్టి, ఓ సినిమా తీద్దామన్న కోరిక ఉంది. నెరవేరుతుందో లేదో చూడాలి.

ప్రశ్న:అప్పట్లో మీరు ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడారంటూ ఓ ఆడియో వైరల్‌ అయ్యింది. దానిపై మీరు కూడా ఫిర్యాదు చేశారు. అది మీరేనా? దానిపై ఇంకా క్లారిటీ ఎందుకు రాలేదు?

అంబటి:అది నేను కాదని చెప్పేశాను కదా. నేను అలా మాట్లాడానంటూ వైరల్‌ చేసింది నా ప్రత్యర్థికి సంబంధించిన టీవీ చానళ్లు. అవన్నీ ఉద్దేశపూర్వకమైనవే. అలాంటి పిచ్చి ప్రచారాలు, చేష్టలకు నేను కంగారుపడేవాడిని కాదు. ఎప్పుడూ చర్చల్లో ఉండాలనుకునే రాజకీయ నాయకుల్లో నేనొకణ్ని. ఒక్కొకరూ ఒక్కో రకంగా అనుకుంటారు. తిట్టేవాళ్లు, పొగిడేవాళ్లు ఉంటారు. వీ డోంట్‌ కేర్‌. నేను ఏదనుకుంటే అది చేసుకుంటూ వెళ్లడం నా ధర్మం.

ప్రశ్న:లోకేశ్‌ రెడ్‌ డైరీలో అంబటి రాంబాబు పేరు ఉందా?

అంబటి:లేకపోతే ఆశ్చర్యం.

ప్రశ్న:రెడ్‌ డైరీలో పేరుందనగానే లోకేశ్‌కు మీరు భయపడుతున్నారా?

అంబటి:అమ్మె.. ఆయనంటే నాకు చాలా భయం (వ్యంగ్యంగా). వాటి గురించి ఏమని చర్చించుకుంటాం?

ప్రశ్న:ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఉందా? రాష్ట్ర రాజధాని ఏది?

అంబటి: మూడు రాజధానులు కావాలని మేం ప్రతిపాదించాం. అది కోర్టులో ఉంది. రాజధానే లేదనడం సరైంది కాదు. అభివృద్ధిని వికేంద్రీకరించి, అన్ని ప్రాంతాలూ బాగుండాలని మూడు ప్రాంతాల మంచి కోసం మేం ఆలోచిస్తున్నాం. అది సరైందని మేమనుకుంటున్నాం. అది తప్పు అనుకునే వాళ్లున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే చేసి చూపిస్తాం. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఇవాల అమరావతిలో ఉంది. వైజాగ్‌లో స్టార్ట్‌ కాలేదు. కోర్టు కూడా అక్కడ స్టార్ట్‌ కాలేదు. కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయి. మేం ప్రకటించాం. ఇది వాస్తవం.

ప్రశ్న:వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానుల అంశంతోనే ప్రజల్లోకి వెళ్తారా?

అంబటి:అందులో అనుమానం ఏముంది? అదే మా విధానం.

ప్రశ్న:విషయంలో ఏం జరిగింది? తెలంగాణ ఎన్నికల రోజు మీరు రాజకీయం చేయాలని చూశారన్న విమర్శలున్నాయి.

అంబటి:సాగర్‌ రైట్‌, లెఫ్ట్‌ కెనాల్స్‌ రెండూ కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు అధీనంలో ఉండాలని, కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండాలని విభజన చట్టంలో ఉంది.

ప్రశ్న:ఎన్నికలకు కొన్ని గంటలకు ముందు ఉధ్రిక్తం చేయడం రాజకీయ వ్యూహంలో భాగమా?

అంబటి:రైట్‌ కెనాల్‌ నుంచి నీళ్లివ్వాలంటే.. అది తెలంగాణ చేతిలో ఉంది. అది అన్యాయమని చెప్పాం. చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి ఆ విషయం పట్టించుకోలేదు.

ప్రశ్న:ఎన్నికలకు కొన్ని గంటల ముందే ఎందుకలా చేయాల్సి వచ్చింది?

అంబటి:అప్పటివరకూ ఘర్షణ జరగకుండా జాగ్రత్త పడ్డాం. చివర్లో సమయం చూసి వ్యూహం ప్రకారం మేం ఆ గేట్లు తెరిచాం. ఇవాల అది కేఆర్‌ఎంబీకి స్వాధీనమైంది. కేంద్రప్రభుత్వ పోలీసు బలగం అక్కడుంది. కొన్ని గంటలకు ముందు చేయడమన్నది మా వ్యూహం. కేసీఆర్‌కు అది లాభమెలా చేస్తుంది? ఆలోచించండి.. తాళాలు పగులగొట్టి ఆంధ్రప్రదేశ్‌ నీళ్లు తీసుకెళ్లడం వారికి నష్టం కలిగించేదే కదా.. మేం ఎవరికో లాభమో, నష్టమో జరగాలనుకుని ఆ చర్యకు పాల్పడలేదు. ఆంధ్రప్రదేశ్‌కు లాభం చేకూర్చేందుకు మాత్రమే చేసిన పని అది.

ప్రశ్న: తెలంగాణలో ప్రభుత్వం మారింది.. ఏపీలో కూడా మారుతుందన్న వాదన వినిపిస్తోంది.

అంబటి:తెలంగాణలో 2014లో కేసీఆర్‌ గెలిచినప్పుడు జగన్‌ గెలిచారా? తర్వాత కేసీఆర్‌ గెలిచినప్పుడు మరోసారి చంద్రబాబు గెలిచారా? ఇక్కడ వరుసగా రెండుసార్లు ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. అక్కడ ఇవ్వరని ఎలా అనుకోగలం? ఏ థియరీ అయినా చెప్పొచ్చు.

ప్రశ్న:50మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటున్నారు?

అంబటి:వారు గెలవరు అనే టిక్కెట్లు తీసేస్తుంటే.. టచ్‌లో ఉంటే ఉండనివ్వండి.. పోయేదేముంది?

ప్రశ్న:మూడేళ్లుగా గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించలేదు? ఇప్పుడెందుకు ఆమోదించారు?

అంబటి:అది పూర్తిగా స్పీకర్‌ విచక్షణకు సంబంధించిన నిర్ణయం.

ప్రశ్న:పోలవరం ఎప్పుడు పూర్తిచేస్తారు?

అంబటి:ఇది టిపికల్‌ ఇష్యూ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరంలో అనేక పనులు చేపట్టాం. ప్రధానమైన స్పిల్‌ వేను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ పూర్తి చేసి నీటిని మరలించాం. ప్రధానమైన ఆనకట్టను నిర్మించాలంటే దానికి కింద డయాప్రాం వాల్‌ వేయాలి. అందుకోసం దిగువన కాపర్‌ డ్యాంల నిర్మాణం జరగాలి. కానీ, టీడీపీ వారు కాపర్‌ డ్యాంలు పూర్తిచేయకుండానే డయాప్రాం వాల్‌ 400 కోట్ల రూపాయలతో వేశారు.

ప్రశ్న: అలాంటప్పుడు 2021 నాటికి పోలవరం పూర్తిచేస్తామని మీ మంత్రి అనిల్‌ ఎలా చెప్పగలిగారు?

అంబటి: అనిల్‌ చెప్పేవరకూ డయాప్రం వాల్‌ దెబ్బతిన్నదన్న విషయం ఎవరికీ తెలియదు. నేను ప్రమాణ స్వీకీరం చేసి పోలవరం వెళ్లి వారం, పది రోజులు స్టడీ చేసిన తర్వాత పోలవరం ఎప్పుడు ప్రారంభిస్తామో చెప్పలేమని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. అప్పుడు చాలా మంది నన్ను తిట్టారు కూడా. అక్కడ పరిస్థితి అలా ఉంది. డయాప్రం వాల్‌ వేసి కాపర్‌ డ్యాంలు పూర్తిచేయకపోవడం చరిత్రాత్మక తప్పిదం. కాపర్‌ డ్యాం మీదుగా నీరు వచ్చి డయాప్రం వాల్‌ కొట్టుకుపోయింది. అది కొత్తగా వేయాలంటే సీడబ్ల్యూసీ కూడా ఇన్వాల్వ్‌మెంట్‌ కూడా అందులో ఉంటుంది. ఇంప్లిమెంటింగ్‌ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మొత్తం అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ప్రతి పనికీ కేంద్ర ప్రభుత్వ క్లియరెన్స్‌ కావాలి. విభజన చట్టంలో పొందుపరిచి ఉన్న ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కట్టాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని నేను చంద్రబాబునాయుడును అడిగాను. దానికి సమాధానం లేదు.

ప్రశ్న: పాలనపై ఇంత కాన్ఫిడెన్స్‌తో ఉన్న మీరు ఎమ్మెల్యేలు, ఎంపీల సీట్లు ఎందుకు మారుస్తున్నారు? కేసీఆర్‌ దీనిపై సలహా ఇచ్చారా?

అంబటి: 175 స్థానాల్లో గెలవడమే వైసీపీ, సీఎం జగన్‌ లక్ష్యం. అందుకు అవసరమైన మార్పులు చేస్తున్నాం. వచ్చేది వందశాతం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే. అంబటి రాంబాబు గానీ, ఎవరైనా గానీ గెలవడనుకుంటే మరో చోటికి పంపిస్తున్నాం; లేదంటే ఆపి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్తున్నాం.

ప్రశ్న: ఎంపీలు ఎందుకు పార్టీ మారుతున్నారు?

అంబటి: టికెట్‌ ఇవ్వలేదని మారుతున్నారు.

ప్రశ్న: మీరు పిలిచి మాట్లాడుతున్నా కన్విన్స్‌ కావడం లేదా?

ప్రశ్న: జూనియర్ ఎన్టీఆర్ టిడిపికి దూరమయ్యారు.  పార్టీకి ఏమయినా సపోర్ట్ చేసే అవకాశాముందా ?

అంబటి: ఉన్నవాళ్ళ సపోర్టి చాలు మాకు

అంబటి:కన్విన్స్‌ కానివాళ్లు వెళ్తారు. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లకు భవిష్యత్తులో అవకాశాలు వస్తాయి. పార్టీని అవకాశవాదులే వీడుతున్నారు.

ప్రశ్న: పార్టీలో పనిచేసే వాళ్లకు గుర్తింపు లేదని కాపు రాంచంద్రారెడ్డి వంటి వాళ్లుంటున్నారు కదా.

అంబటి: అందరూ తాము పనిచేశామనే అనుకుంటారు. గుర్తించాల్సింది పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డే. పార్టీని వీడిన వాళ్లంతా తమ శ్రమకు గుర్తింపు లేదనే చెప్తారు. రాజకీయాల్లో ఇది సహజం.

ప్రశ్న: వై నాట్‌ 175 అంటే మీరు నమ్ముతున్నారా?

అంబటి: మేం నమ్మే ముందుకెళ్తున్నాం.

ప్రశ్న: అంటే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ వంటి వారు అసెంబ్లీలోకి రాలేరా?

అంబటి:రాకూడదనే మేం భావిస్తాం.

ప్రశ్న: టీడీపీ-జనసేన పొత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని మీరు భావిస్తున్నారు?

అంబటి: లోకేశ్‌ అనుకుంటున్నాను.

ప్రశ్న: ప్రతిపక్షం ఉండకూడదని మీ ఉద్దేశమా? అది రాజ్యాంగ విరుద్ధం కాదా?

అంబటి: మా ఉద్దేశం అలా ఉండకూడదా? ప్రతిపక్షానికి కొన్ని సీట్లేమైనా మేం రిజర్వు చేయాలా? ప్రతిపక్షం ఉండాలా, వద్దా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. కాలం నిర్ణయిస్తుంది.

ప్రశ్న: వైసీపీకి పోటీ ఎవరని మీరనుకుంటున్నారు?

అంబటి: టీడీపీ - జనసేన రెండో స్థానంలో ఉంటాయనుకుంటున్నాం.

ప్రశ్న: ముద్రగడ పద్మనాభం వైసీపీని వీడి.. జనసేనలోకి వెళ్లబోతున్నారని చెప్తున్నారు.

అంబటి: ఆయన వైసీపీలో లేరు. ఎన్నికల ముందు వచ్చినట్టే వస్తారు.. వెళ్లినట్టే వెళ్తారు.. చాలాచాలా జరుగుతుంటాయి.

ప్రశ్న: అంత పెద్ద నాయకుడిని ఎందుకు వదులుకుంటున్నారు?

అంబటి: మేం ఆయనను పట్టుకుంటే కదా వదలడానికి.. ఆయన మా పార్టీ వాడు కాదు.

ప్రశ్న: పార్టీ కాకపోయినా ముద్రగడ వైసీపీ సానుభూతి పరుడే కదా.. వైఎస్సార్‌ అధికారంలో ఉన్నా, జగన్‌ అధికారంలో ఉన్నా ముద్రగడ పద్మనాభం నోరు విప్పి మాట్లాడరు కదా.

అంబటి:ముద్రగడ పద్మనాభం ఇండివిడ్యువల్‌గా బిహేవ్‌ చేసే లీడర్‌. పట్టుదల కలిగిన వ్యక్తి. దేనికీ అమ్ముడు పోని వ్యక్తి. అనుకున్నది సాధించడం కోసం ఎంతదూరమైనా ప్రయాణించే వ్యక్తి. అయితే, ఆయన వైసీపీ నాయకుడు కాదు.

ప్రశ్న: పవన్‌ కల్యాణ్‌కు కౌంటర్లు ఇవ్వడానికి, కాపు ఓట్లను ఆకట్టుకోవడానికి ముద్రగడను మీరు ఆకర్షించే ప్రయత్నం చేశారు కదా..

అంబటి: మీరు ఎవరినైనా ప్రభావితం చేయగలిగితే మిమ్మల్ని కూడా ఆకర్షిస్తాం.. అందులో తప్పేమీ లేదు. రాజకీయం అనేది ఎత్తుగడ. ముద్రగడ పద్మనాభం అనే నాయకుడిని హింసించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందువల్ల ఆయన మాకు సానుభూతిపరుడిగా ఉన్నారని అనుకోవడంలో తప్పు లేదు. ఆయనను వేధించినప్పుడు ఆయనకు మద్దతుగా నిలబడిన వ్యక్తులం మేము. నేను, చిరంజీవి, దాసరి నారాయణరావు వంటి వారిమంతా హోటల్‌ హయత్‌లో సమావేశమయ్యాం. "వంగవీటిని కోల్పోయాం, ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేము" అని దాసరి నారాయణరావు అన్నారు. అంతమాత్రాన ఆయనేమీ మా పార్టీ వ్యక్తి కాదు. మా పార్టీలోకి వస్తారని వార్తలొచ్చాయి. రావడం లేదంటూ మళ్లీ వార్తలొచ్చాయి. తర్వాత జనసేనలో చేరుతారని కూడా వార్తలొచ్చాయి. చివరికి ఏది నిజమవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. అప్పుడు దానిగురించి మాట్లాడుకుందాం.

ప్రశ్న: టీడీపీకి కాపు ఓట్లు వెళ్లిపోతాయన్న భయం వైసీపీకి కలిగిందా?

అంబటి: దీనిలో భయాలేమీ లేవు. పవన్‌ కల్యాణ్‌ వెంట కాపు ఓట్లు వెళ్లిపోతున్నాయని అనుకుంటున్నారు. అయితే, కాపులు మొదట పవన్‌ కల్యాణ్‌ వెంట ఉన్నప్పటికీ; పవన్‌ చంద్రబాబు చంకనెక్కిన వెంటనే ఆయనకు దూరమయ్యారని నేనంటున్నాను. కాలం నిర్ణయిస్తుంది.

ప్రశ్న: 2024 ఎన్నికలకు వైసీపీ ఏ వ్యూహంతో వెళ్తోంది? ఎవరితో పొత్తుతో వెళ్తోంది?

అంబటి:ఎవరితో మాకు పొత్తు లేదు. ఎవరైనా ఏమైనా అనుకుంటే అనుకోనియండి. మేం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తాం. ఎవరో ఏదో వాగుతున్నారని మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.

                                     ఈ కింది వీడియో లో ఫుల్ ఇంటర్వ్యూ చూడండి

ALSO READ: జగన్ టార్గెట్ గా టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తు ?త్వరలో ఢిల్లీ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

Advertisment
Advertisment
తాజా కథనాలు