Amazon Sale: ఈరోజు నుంచి గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ అమెజాన్ సేల్..

ఈరోజు నుంచి అమెజాన్‌లో గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్ ప్రారంభం అవుతోంది. ఆగస్టు 15వరకు ఇది కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సేల్ అందుబాటులోకి రానుంది.

New Update
Amazon Sale: ఈరోజు నుంచి గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ అమెజాన్ సేల్..

Great Freedom Festival: ఎప్పటిలానే అమెజాన్ బోలెడన్ని ఆఫర్లతో మళ్ళీ వచ్చేసింది. ప్రతీ ఏడాది ఆగస్టులో ఉండే గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ ఈరోజు నుంచి మొదలవబోతోంది. ఆగస్టు 6 నుచి ఆగస్టు 15వరకు ఈ సేల్ నడనుంది. ప్రైమ్ యూజర్లకు ఇప్పటికే మొదలయిపోయిన ఈ సేల్ సాధారణ యూజర్లకు మాత్రం ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది.

ఇక ఈ సేల్‌లో మొబైల్ ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ఆపిల్, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, పోకో, ఐకూ వంటి ఫోన్లపై డిస్కౌంట్‌ లభిస్తుంది. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ వస్తుంది. దీంతో ఐఫోన్ 13 (128జీబీ) రూ.47,999కే లభిస్తుంది. వన్‌ప్లస్‌ 12ఆర్‌ రూ.40,999కే లభిస్తుందని అమెజాన్‌ ప్రకటించింది. వీటితో పాటూ శాంసంగ్‌ ఎస్‌24 5జీ రూ.74,999కు కొనుక్కోవచ్చును.మరోవైపు వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 లైట్‌ రూ.16,999, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ 5జీ రూ.24,999లకే లభించనున్నాయి. ఇక ఇటీవల లాంచ్‌ అయిన వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 రూ.27,999లకు, లావా బ్లేజ్‌ ఎక్స్‌ రూ.13,249లకు ఇస్తామని అమెజాన్‌ ఆఫర్లు ప్రకటించింది.

Also Read: US Woman: తానే కట్టేసుకుంది..అమెరికా మహిళ కేసులో ట్విస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు