Altman on AI: సరికొత్తగా..మరింత సామర్ధ్యంతో AI ఉంటుంది..ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ AI ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఇది మరింత సామర్ధ్యంతో ఉపయోగపడుతుందని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ చెప్పారు. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By KVD Varma 20 Jan 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Altman on AI: కొత్త AI (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) మోడల్ ప్రస్తుత మోడళ్ల కంటే ఎక్కువ సామర్థ్యంతో ఉంటుందని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ చెప్పారు. ఆల్ట్‌మాన్, దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మాట్లాడుతూ, భవిష్యత్తులో AI మోడల్‌లు మరింత సౌకర్యంగా ఉండవచ్చని అన్నారు. చాట్ జిపిటిని ఎలా ఉపయోగించాలో ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఆల్ట్‌మాన్(Altman on AI) ఇంకా మాట్లాడుతూ, ప్రజలు చాట్ GPTని వారికి ఉపయోగకరంగా ఉండేలా చేయడానికి మార్గాలను కనుగొన్నారని.. ఏది ఉపయోగించకూడదో నేర్చుకున్నారని అన్నారు. AI రహస్యం కొంతవరకు పోయింది, ఎందుకంటే ప్రజలు ఇప్పుడు దీనిని ఉపయోగిస్తున్నారు. కొత్త సాంకేతికతతో ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఎప్పుడూ ఉత్తమ మార్గం. Altman on AI: AI మునుపటి సాంకేతికతల కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది అలాగే, సాంకేతికతను విస్తరించడానికి "సౌకర్యకరమైన" నిర్ణయాలు అవసరం. భవిష్యత్ AI మోడల్‌లు చాలా వ్యక్తిగత అనుకూలీకరణను అనుమతించవలసి ఉంటుంది. ఇది చాలా మందికి సౌకర్యాన్ని కలిగిస్తుంది. అంటూ ఆల్ట్‌మాన్ వివరించారు. Also Read: భలే ఛాన్స్.. దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే.. AI మన సామర్థ్యాలను పెంచుతుంది కానీ.. ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించి ఆల్ట్‌మాన్(Altman on AI) ఇలా అన్నారు. ‘'AI ఆచరణలోకి రావడంతో, మనందరికీ చాలా సామర్థ్యం - శక్తి అందుబాటులోకి వస్తుంది. నిర్ణయాలు కూడా మన చేతుల్లోనే ఉంటాయి.’’ ఆల్ట్‌మన్ OpenAI CEOగా తప్పుకుని.. మళ్ళీ వచ్చారు.. . నవంబర్ 29న, OpenAI సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ కంపెనీ CEOగా తిరిగి వచ్చారు. నవంబర్ 18న అతడిని కంపెనీ నుంచి బోర్డు తొలగించింది. మళ్ళీ పది రోజుల్లోనే ఆయనను కంపెనీల్లోకి తీసుకున్నారు. Watch this interesting News: #ai-technology #artificial-intelligence మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి