ఆ సినిమా కోసం బన్నీ రూ.300 కోట్లు తీసుకుంటున్నాడా?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న 'పుష్ప 2' కోసం ఏకంగా రూ.300 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా లాభాల్లోనూ బన్నీకి వాటా ఉందని ఇండస్ట్రీలో చర్చనడుస్తోంది.

New Update
ఆ సినిమా కోసం బన్నీ రూ.300 కోట్లు తీసుకుంటున్నాడా?

Allu Arjun Remuneration: స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ ఆయన దర్శకత్వంలోనే రూపొందుతున్న 'పుష్ప 2'తో (Pushpa 2) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ మూవీ కోసం అల్లు అర్జున్ భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత సీక్వెల్ పై భారీ అంచనాలు పెరగడంతో బడ్జెట్ విషయంలోనూ నిర్మాతలు వెనక్కి తగ్గట్లేదని, ఈ క్రమంలోనే బన్నీ కూడా తన రేంజ్ పేంచేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఈ మేరకు 'పుష్ప 2' కోసం రూ.300 కోట్లపైనే కావాలని అడుగున్నాడట. పుష్ప మొదటి పార్ట్ కోసం బన్నీ సుమారు రూ.50 కోట్ల వరకూ రెమ్యునరేషన్ రూపంలో అందుకున్నాడని వార్తలు వచ్చాయి. ఆ సినిమా హిట్ అవడంతో సీక్వెల్ కోసం అతడు తన పారితోషికాన్ని డబుల్ చేశాడని, పుష్ప 2 కోసం సుమారు రూ.120 కోట్లు అందుకోబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. కానీ అసలు రెమ్యునరేషనే లేదని, లాభాల్లో వాటా అతనికి దక్కబోతోందని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య ఓ సినిమా జర్నలిస్ట్ చేసిన ట్వీట్ తాజా పుకార్లకు తెరలేపాయి. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అసలు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని, అయితే సినిమాకు వచ్చే ఆదాయంలో 33 శాతం అతనికి దక్కుతుందన్నది ఆ ట్వీట్ సారాంశం.

Also Read :ఆ సినిమా చూసే రాజకీయాల్లోకి వచ్చాను.. మంత్రి మల్లారెడ్డి

అలాగే పుష్ప 2కి ఇప్పుడున్న హైప్ నేపథ్యంలో రూ.1000 కోట్లకుపైనే బాక్సాఫీస్ కలెక్షన్లు ఖాయమని, ఆ లెక్కన అల్లు అర్జున్ (Allu Arjun) కి రూ.300 కోట్లకుపైనే దక్కుతుందని కొందరు సోషల్ మీడియాలో లెక్కలేసేశారు. బాక్సాఫీస్ కాకుండా డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కుల రూపంలో కొన్ని వందల కోట్లు మేకర్స్ కు రానున్నాయి. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే పుష్ప 2 ఆదాయం భారీగా ఉండనుందని, బన్నీకి దెబ్బకు వందల కోట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే ఈ లెక్కల్లో నుంచి సినిమా తీయడానికి అయ్యే ఖర్చు, ఇతర నటీనటులకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్లు అన్నీ తీసేస్తే.. చివరగా లాభాలు రూ.500 కోట్లకు మించే పరిస్థితి ఉండదు. ఆ లెక్కన చూసుకున్నా.. 33 శాతం అంటే అల్లు అర్జున్ కు దక్కేది రూ.150 కోట్ల కంటే ఎక్కువ ఉండదని మరికొందరు లెక్కలు తీస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే తప్పా క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు