Telangana:కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈరోజు ఆయన కాంగ్రెస్‌లో .ఆయిన్ అవనున్నారు. కంచర్లకు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.

New Update
Telangana:కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్

Kancharla Chandra Sekhar joining in Congress:మొత్తానికి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఈయన పోటీ చేస్తారని అనుకున్నారు. టికెట్ ఖాయమని చెప్పారు. కానీ చివరకు ఆయనకు సీటు దక్కలేదు. ఇప్పుడు చంద్రశేఖర్ బీఆర్ఎస్‌ను వీడి వచ్చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తోంది. కంచర్లకు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.

అల్లుడి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది..
తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు చంద్రశేఖరే స్వయంగా ప్రకటించారు. దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఎంపీగా పోటీ చేస్తే అల్లుడు అర్జున్ ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించగా.. తన గెలుపునకు ఆయన తప్పకుండా కృషి చేస్తారని చంద్రశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

నాగార్జునాసాగర్ నుంచి అసెంబ్లీకి..

బీఆర్ఎస్ (BRS) స్టేట్ లీడర్ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునాసాగర్ నుంచి పోటీ చేయాలని భావించారు. దీని కోసం బోలెడు కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఎన్నికల ప్రచారానికి అల్లుడు అల్లు అర్జున్‌ని కూడా సిద్ధం చేశారు. కానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కంచికర్లకు హ్యాండ్ ఇచ్చింది. మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే భరత్‌కే టికెట్‌ను కేటాయించింది. అంతకు ముందు 2014లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి చంద్రశేఖర్రెడ్డి ఓడిపోయారు. అక్కడి రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సాగర్‌పైన ఈసారి పోటీ చేద్దామనుకున్నారు. అది కూడా అవలేదు. ఇప్పుడు ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు కంచర్ల చంద్రశేఖర్.

Also Read:Telangana : ఖమ్మం జిల్లాలో బంగ్లాదేశీలు..అదుపులో పదిమంది

Advertisment
Advertisment
తాజా కథనాలు