విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగష్టు 15 వేడుకులకు సర్వం సిద్ధమైంది. స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 9 గంటలకు ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇప్పటికే ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్ధం చేశారు. శకటాల ప్రదర్శనను తిలకించిన సీఎం జగన్.. అనంతరం పలువురికి అవార్డులను అందజేస్తారు. By E. Chinni 14 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగష్టు 15 వేడుకులకు సర్వం సిద్ధమైంది. స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 9 గంటలకు ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇప్పటికే ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్ధం చేశారు. శకటాల ప్రదర్శనను తిలకించిన సీఎం జగన్.. అనంతరం పలువురికి అవార్డులను అందజేస్తారు. ఇకపోతే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఆహ్వానితులు, పాస్ లు ఉన్నవారు ఉదయం 8 గంటల కల్లా సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చొవాలని అధికారులు వెల్లడించారు. అనంతరం ఐదున్నర గంటలకు రాజ్ బవన్ లో గవర్నర్ ఇచ్చే ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులతో కలిసి హాజరు కానున్నారు. అలాగే మంగళవారం చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ మువ్వెన్నల జెండాను ఎగురవేయనున్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటితో ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ముగుస్తాయి. వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 10 వేల మంది పోలీసులు పహారా కాయనున్నారు. డ్రోన్ విధ్వంసక వ్యవస్ధలను మోహరించారు. 1000 ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను అమర్చారు. #andhra-pradesh #vijayawada #independence-celebrations #andhra-pradesh-cm-jagan #andhra-padesh-government #indira-gandhi-stadium మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి