Alia Bhatt : 163 మంది, 80 రోజుల కష్టం.. మెట్ గాలా ఫ్యాషన్ షో లో ఆలియా చీర ప్రత్యేకతలివే! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలాలో మెరిసింది. ఫ్యాషన్ షోలో ఆలియా భట్ ధరించిన చీరను ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు. ఈ శారీ డిజైన్ చేయడం కోసం ఏకంగా 1965 గంటల సమయం పట్టిందట. అంటే దాదాపు 80 రోజులు పట్టినట్లు డిజైనర్ వెల్లడించారు. By Anil Kumar 07 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Alia Bhatt In Met Gala Fashion Show 2024 : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలా(Met Gala) లో మెరిసింది. గత ఏడాది ఇదే ఫ్యాషన్ షో రెడ్ కార్పెట్ పై కనిపించిన ఆలియా ఇప్పుడు ఏకంగా పార్టిసిపేట్ చేసింది. కాగా ఈ ఈవెంట్ లో ఆలియా ధరించిన చీర గురించి ఇప్పుడు బీ టౌన్ లో పెద్ద చర్చ నడుస్తోంది. అందుకు కారణం ఆలియా భట్ ధరించిన చీరకు చాలా ప్రత్యేకతలు ఉండటమే. ఇంతకీ ఏంటా ప్రత్యేకతలు? ఫ్యాషన్ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా ఆలియా చీర మెట్ గాలా ఫ్యాషన్ షోలో ఆలియా భట్ ధరించిన చీరను ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు. గ్రీన్ కలర్ లో ఉన్న ఈ శారీకి సరిపడా నగలు ధరించి ఆలియా ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసిన పూల చీరలో అలియా లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రతుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. Also Read : వైరల్ అవుతున్న మెగా డాటర్ న్యూ టాటూ.. ఏకంగా ఆ పార్ట్ మీద.. ఆలియా చీరకి అన్ని ప్రత్యేకతలా? ప్రపంచ వేదికపై మన భారతీయ సంస్కృతి(Indian Culture) ఉట్టిపడేలా ఆలియా భట్ ఈ చీరను డిజైన్ చేయించింది. ఈ శారీ డిజైన్ చేయడం కోసం ఏకంగా 1965 గంటల సమయం పట్టిందట. అంటే దాదాపు 80 రోజులు పట్టినట్లు డిజైనర్ వెల్లడించారు. అంతేకాదు ఈ చీరను రూపొందించేందుకు 163 మంది విశ్రాంతి లేకుండా పని చేశారట. ఇటలీలో ఈ చీరను తయారు చేయడం విశేషం. ఆలియా భట్ చీర ప్రత్యేకతలు తెలిసి ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్స్ సైతం ఆశ్యర్యానికి లోనవుతున్నారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) #bollywood #alia-bhatt #metgala-fasion-show-2024 #fashion-show మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి