Sanatana Remarks Row: మోదీకి సీఎం స్టాలిన్ కౌంటర్.. సనాతన ధర్మాన్ని హెచ్‌ఐవీతో పోల్చిన రాజా! సనాతన ధర్మాన్ని డెంగీ, మాలేరియాతో పోల్చిన తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వ్యాఖ్యలపై ఓవైపు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుండగానే.. మరో డీఎంకే మంత్రి రాజా కొత్త దుమారాన్ని రేపారు. సనాతన ధర్మాన్ని హెచ్‌ఐవీ(HIV)తో పోల్చారు. ఇక ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రశ్నించిన ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ కౌంటర్ వేశారు. 'జాతిహత్య' అనే పదాన్ని ఉదయనిధి అసలు ఎక్కడా అనలేదని.. అన్ని విషయాలు తెలుసుకోకుండా మోదీ ఎందుకు మాట్లాడారో తనకు తెలియదంటూ చురకలంటించారు. By Trinath 07 Sep 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Udhayanidhi Stalin on Sanatana Dharma remarks row continues: తమిళనాడు ముఖ్యమంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత ఎంకే స్టాలిన్ (M.K. Stalin) తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై మౌనం వీడారు. ఉదయనిధి ఏమి మాట్లాడారో తెలియకుండా ప్రధాని (PM Modi) వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు స్టాలిన్. సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం సామాజిక న్యాయం భావనకు విరుద్ధంగా ఉందని.. అది డెంగీ, మలేరియాతో సమానామని చెప్పడం దేశవ్యాప్తంగా తీవ్ర రచ్చకు దారి తీసింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై వస్తోన్న విమర్శలు అర్థం లేనివన్నారు. తమిళనాడు సీఎం 'అణచివేత సూత్రాలకు వ్యతిరేకంగా బీజేపీ అనుకూల శక్తులు అతని వైఖరిని సహించలేకపోతున్నాయని.. అందుకే తప్పుడు కథనాన్ని వ్యాప్తి చేశాయని మండిపడ్డారు. అసలు ఉదయనిధి మారణహోమానికి పిలుపునిచ్చారంటూ చేస్తున్న ప్రచారంలో అసలు నిజం లేదని... ఉదయనిధి ఆ మాటలు ఎక్కడ అన్నారో చూపించాలన్నారు స్టాలిన్. మోదీపై స్టాలిన్ విమర్శలు.. అంతా అబద్ధం: బీజేపీ పెంచి పోషించే సోషల్ మీడియా గ్రూపులు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేశాయని మండిపడ్డారు స్టాలిన్. అయితే, ఉదయనిధి ఎప్పుడూ తమిళంలో గానీ, ఇంగ్లీషులో గానీ 'జాతిహత్య' అనే పదాన్ని ఉపయోగించలేదని.. అయినప్పటికీ, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన స్టాలిన్ తన కుమారుడి తలపై రాష్ట్రానికి చెందిన ఒక జ్ఞాని అందించిన బహుమానం గురించి, 'ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతనిపై ఏదైనా చర్య తీసుకుందా? బదులుగా ఉదయనిధిపై కేసులు పెట్టారు. ఈ పరిస్థితుల్లో, తన మంత్రి మండలి సమావేశంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు సరైన స్పందన అవసరమని ప్రధాని పేర్కొన్నట్లు మీడియా నుంచి వినడం చాలా ఆశ్చర్యపరిచిందని' చురకలంటించారు స్టాలిన్. சனாதனத்தை ஏற்பவன் மனிதனே அல்ல... 😡 - @dmk_raja#Minnambalam #araja #udhayanidhistalin #modi #amithshah #dmk #mkstalin #bjp #annamalai #tamilisaisoundararajan #மின்னம்பலம் pic.twitter.com/7WNWSrojH0 — Minnambalam (@Minnambalamnews) September 6, 2023 'ఏదైనా క్లెయిమ్ లేదా నివేదికను ధృవీకరించడానికి ప్రధాన మంత్రికి అన్ని వనరులు అందుబాటులో ఉంటాయి. ఉదయనిధి గురించి ప్రచారం చేసిన అబద్ధాల గురించి ప్రధానికి తెలియకుండా మాట్లాడుతున్నారా, లేదా అతను తెలిసి అలా చేస్తున్నారా' అని డీఎంకే చీఫ్ ప్రశ్నించారు. డీఎంకే (DMK) లాంటి దీర్ఘకాల పార్టీ ప్రతిష్టను దిగజార్చగలమని బీజేపీ (BJP) విశ్వసిస్తే, వారు ఆ ఊబిలో మునిగిపోతారని కౌంటర్లు వేశారు. మహిళలను తక్కువ చేస్తారు: డీఎంకే చీఫ్, తన కుమారుడికి మద్దతు ఇస్తూ, 'కొందరు వ్యక్తులు ఇప్పటికీ ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తారు, మహిళలు పని చేయకూడదని, వితంతువులు పునర్వివాహం చేసుకోకూడదని వాదిస్తారు, పునర్వివాహం కోసం ఎలాంటి ఆచారాలు లేదా మంత్రాలు లేవు. మానవజాతిలో సగానికి పైగా ఉన్న స్త్రీలపై అణచివేతను కొనసాగించడానికి వారు 'సనాతన' అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అలాంటి అణచివేత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాత్రమే ఉదయనిధి మాట్లాడారు'. ఆ సిద్ధాంతాలపై ఆధారపడిన పద్ధతులను నిర్మూలించాలని పిలుపునిచ్చారని స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. హెచ్‌ఐవీతో పోల్చిన రాజా: సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై వేడి చల్లారకముందే డీఎంకే ఎంపీ ఏ రాజా రెచ్చిపోయారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కించపరిచే వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు . సనాతన ధర్మాన్ని హెచ్‌ఐవీతో పోల్చారు. తనను అనుమతిస్తే సనాతన ధర్మంపై చర్చకు సిద్ధమని రాజా చెప్పారు. ప్రధానమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసి తనని అనుమతిస్తే, క్యాబినెట్ మంత్రులందరికీ సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు రాజా. అన్ని అసమానతలతో పోరాడామని.. సనాతన ధర్మాన్ని అంగీకరిస్తే పెరియార్‌ని వ్యతిరేకించిన వాళ్లమవుతామన్నారు రాజా. సనాతన ధర్మాన్ని అంగీకరిస్తే తాను అసలు మనిషిని కానంటూ వ్యాఖ్యానించారు. சனாதனம் என்றால் என்ன? @dmk_raja 👇👏👏👏👏 #SanatanaDharma pic.twitter.com/Y2G5wR2wgW — SELVASINGH (@SELVASINGH2) September 6, 2023 ALSO READ: ఉదయనిధి స్టాలిన్‌పై FIR.. క్షమాపణ చెప్పాలని డిమాండ్! #pm-modi #cm-stalin #udhayanidhi-stalin #sanathana-dharma-remarks-row #stalin-on-sanatana-dharma #cm-stalin-counters-modi-over-sanatana-dharma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి