National: సూరత్ తర్వాత ఇండోర్.. మరో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ. సూరత్ తర్వాత మరో కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇండోర్ నుంచి పోటీ చేస్తున్న అక్షయ్ బామ్ తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించారు. బీజేపీలో చేరేందుకే ఈ పని చేసినట్టు తెలుస్తోంది. By Manogna alamuru 29 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఇండోర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బాఈమ్ ఈరోజు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆయన తన ఫామ్‌ను సమర్పించేందుకు బీజేపీ ఎమ్మెల్యే రమేష్ మెండోలాతో కలిసి వెళ్ళారు. ఈరోజే నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు అవడంతో కాంగ్రెస్ నేత ఈ పని చేసినట్టు తెలుస్తోంది. దీని తర్వాత ఆయన బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. రీసెంట్‌గా సూరత్‌లో కాంగ్రెస్, ఇంకా ఇతర నాయకులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడంతో అక్కడ బీజేపీ అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నిక అయిన సంగతి తెలిసిందే. అసంతృప్తితోనేనా? అక్షయ్ బామ్ కాంగ్రెస్ నేత. ఈయన అసలు అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. అయితే కాంగ్రెస్ పెద్దలు అక్షయ్‌కు దీన్ని ఇవ్వలేదు. దాని తరువాత ఎంపీ టికెట్‌ను ఆఫర్ చేయడంతో దానికి ఆయన నామినేషన్ వేశారు. అయితే అక్షయ్ బామ్ ఈ నామినేషన్‌ను కూడా ఉపసంహరించుకున్నారు. దీంతో ఇక్కడ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ గెలుపు దాదాపు ఖాయమైనట్టు అయిపోయింది. దీంతో పాటూ అక్షయ్ బామ్ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన నామినేషన్ ఉపసంహరణ తర్వాత బీజేపీ మంత్రి కైలాష్ విజయ వర్గియా ఎక్స్‌లో పోస్ట్ పెడుతూ..బీజేపీలోకి స్వాగతం అని రాశారు. इंदौर से कांग्रेस के लोकसभा प्रत्याशी श्री अक्षय कांति बम जी का माननीय प्रधानमंत्री श्री @narendramodi जी, राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी, मुख्यमंत्री @DrMohanYadav51 जी व प्रदेश अध्यक्ष श्री @vdsharmabjp जी के नेतृत्व में भाजपा में स्वागत है। pic.twitter.com/1isbdLXphb — Kailash Vijayvargiya (Modi Ka Parivar) (@KailashOnline) April 29, 2024 #congress #bjp #national #surat #indore మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి